ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్‌కు మహేష్ బాబు
వరల్డ్ కప్‌లో భాగంగా నేడు టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న 14వ మ్యాచ్‌ని వీక్షించేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్‌లోని ఓవల్ స్టేడియంకు రానున్నారని తెలుస్తోంది.
లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా నేడు టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న 14వ మ్యాచ్‌ని వీక్షించేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్‌లోని ఓవల్ స్టేడియంకు రానున్నారని తెలుస్తోంది. మహర్షి సినిమా విజయం తర్వాత భార్య నమ్రత, కొడుకు గౌతం, కూతురు సితారలతో కలిసి విదేశీ పర్యటనలో వున్న మహేష్ బాబు నేటి మధ్యాహ్నం 3 గంటలకు అక్కడే జరగనున్న మ్యాచ్‌ని వీక్షించనున్నట్టు సమాచారం. క్రికెట్‌లో రెండు దిగ్గజ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌పైనే ప్రస్తుతం ఇరు దేశాలకు చెందిన క్రికెట్ ప్రియుల దృష్టి కేంద్రీకృతమై వుంది.
ఇక మహేష్ బాబు సినిమా ప్రాజెక్ట్స్ విషయానికొస్తే, ఈ సమ్మర్ ట్రిప్ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేయడానికి రెడీగా వున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించనున్నారు.