Manu bhaker father ram kishan bhaker shuts down on Neeraj chopra and manu marriage rumours: పారిస్ జరిగిన ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో, మనుభాకర్ షూటింగ్ లో అదరగొట్టారు. ఇద్దరు కూడా మన దేశానికి పతకాలను తీసుకొచ్చారు. ఈ క్రమంలో మనుబాకర్, నీరజ్ చోప్రాలు సన్నిహితంగా ఉండి చనువుగా మాట్లాడుకున్న వీడియో లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు. ముఖ్యంగా మనుభాకర్.. నీరజ్ తో నవ్వుతూ మాట్లాడటం, అంతేకాకుండా.. మను తల్లి సుమేధా.. వారి ఫోటోలను తీసేందుకు కూడా ప్రయత్నించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


దీనికి మనువద్దని నవ్వుతూ వారించింది.ఆ తర్వాత నీరజ్ చోప్రాతో..సుమేధా ప్రత్యేకంగా మాట్లాడి.. తన తలపై ఒట్టుకూడా వేయించుకున్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఇద్దరికి మధ్య తొందరలోనే పెళ్లిబాజాలు పక్కా.. అంటూ రూమర్స్ లు చక్కలు కొట్టాయి. తాజాగా, దీనిపై మనూ తండ్రి  రామ్ కిషన్ భాకర్ స్పందించారు. మనుఇంకా చిన్న పిల్ల అని అన్నారు.


మను, నీరజ్ లు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని అన్నారు. అంతేకాకుండా.. మను తల్లి.. నీరజ్ ను తన కొడుకులా భావిస్తుందని బాంబు పేల్చారు. ప్రస్తుతం మనుతన కెరియర్ లో బిజీగా ఉంటుందని, ఆమె పెళ్లి గురించి తాము.. ఇంకా ఆలోచించలేదని  బదులిచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెళ్లి రూమర్స్ కు  మాత్రం ప్రస్తుతం చెక్ పడిందనిచెప్పుకొవచ్చు.


Read more: Vinesh Phogat: కోచ్, న్యూట్రిషనిస్ట్ లపై అనుమానాలు.. బాంబు పేల్చిన భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు..


ఒలింపిక్స్ మను.. 10 మీటర్ల పిస్టల్ విభాగంలో, రెండు కాంస్యాలు సొంతంచేసుకుంది. 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ లో.. వ్యక్తిగత, మిక్స్ డ్ విభాగంలో కాంస్య పతకాలను సాధించింది. మరోవైపు బల్లెంవీరుడు నీరజ్ చోప్రా.. ఈటెను 89.45 మీటర్లు విసిరి రజతం సాధించాడు. వీరిద్దరిది కూడా హర్యానా రాష్ట్రం కావడం మరో విశేషం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter