Marnus Labuschagne asks Cigarette Lighter from Field: ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ టెస్ట్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబూషేన్‌ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు.. మ్యాచ్ జరుగుతుండగా మైదానం నుంచే సిగరెట్ లైటర్ కావాలంటూ లబూషేన్‌ ఆసీస్ డ్రెస్సింగ్‌ రూమ్‌కు సైగ చేశాడు. ఈ చర్యతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ఫాన్స్, కామెంటేటర్లు ఆశ్చర్యపోయారు. ఇక ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ అయితే లైటర్ ఎందుకు అడుగుతున్నాడో అర్ధంకాక తలపట్టుకుంది. ఈ ఘటన సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్ (10) ఔట్ అయ్యాక మార్నస్‌ లబూషేన్‌ క్రీజులోకి వచ్చాడు. లబూషేన్‌ బ్యాటింగ్ చేస్తుండగా హెల్మెట్‌తో సమస్య ఏర్పడింది. దాంతో హెల్మెట్‌ను పలుసార్లు తీసి.. మళ్లీ పెట్టుకున్నాడు. చివరకు హెల్మెట్‌ను రిపేర్‌ చేసేందుకు సిగరెట్‌ లైటర్‌ కావాలని ఆసీస్ డ్రెస్సింగ్‌ రూమ్‌కు సైగ చేశాడు. సిగరెట్‌ను కాల్చే లైటర్ తేవాలంటూ పలుమార్లు సైగలు చేశాడు. లబూషేన్‌ చేసిన సైగతో ప్లేయర్స్, ఫాన్స్, కామెంటేటర్లు షాక్ అయ్యారు. ఆసీస్  డ్రెస్సింగ్‌ రూమ్‌ సిబ్బందికి కూడా లైటర్‌ ఎందుకు అడుతున్నాడో అర్ధం కాలేదు.


కొంతసేపటికి విషయాన్ని గ్రహించిన ఆస్ట్రేలియా మేనేజ్మెంట్, డ్రెస్సింగ్‌ రూమ్‌ సిబ్బంది లైటర్‌ను తీసుకెళ్లి మార్నస్‌ లబూషేన్‌కు ఇచ్చారు. లైటర్‌తో హెల్మెట్‌ లోపలి భాగంలో కాలుస్తూ రిపేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. 'మ్యాచ్ మధ్యలో సిగరెట్‌ తాగాలనిపించేదేమో' అని లబూషేన్‌ను సరదాగా ఆటపట్టిస్తున్నారు. ఏదేమైనా లబూషేన్‌ సైగ తొలి రోజు ఆటకు హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 



ముందుగా వర్షం అంతరాయం కలిగించడం.. ఆపై వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆటలో 47 ఓవర్లు మాత్రమే పడ్డాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖ్వాజా (54 నాటౌట్‌; 121 బంతుల్లో 6 ఫోర్లు), మార్నస్‌ లబూషేన్‌ (79; 151 బంతుల్లో13 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అన్రిచ్‌ నోర్జే రెండు వికెట్స్ తీశాడు. 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఆసీస్‌ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దాంతో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. 


Also Read: IPL 2023: ఐపీఎల్ ఆడకుంటే వచ్చే నష్టమేం లేదు.. రోహిత్, కోహ్లీలను హెచ్చరించిన బీజేపీ ఎంపీ!  


Also Read: Gram Flour Face Packs: ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. మీ ముఖం రష్మిక మందన్నలా మెరిసిపోతుంది! ట్రై చేసి చుడండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.