మేరీకోమ్ ఎటాక్ షురూ..!
వియత్నాంలో జరిగే ఆసియాన్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌కు ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ఎంపికయ్యారు. హోచిమన్ సిటీలో నవంబరు 2వ తేది నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నిలో 48 కేజీల విభాగంలో మేరీకోమ్ యువ బాక్సర్‌లను ఎదుర్కోనున్నారు. 2015లో మేరీకోమ్ ఇదే టోర్నికి దూరం అవ్వడంతో, ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే టోర్నిలో భారత్ నుండి వివిధ విభాగాల్లో పోటీ పడడానికి ఇతర బాక్సర్లు కూడా ప్రయాణమవుతున్నారు. నీరజ్ (51 కేజీలు), శిక్షా (54 కేజీలు), సోనియా లాథర్ (57 కేజీలు), పవిత్ర (60 కేజీలు) సరితా దేవి (64 కేజీలు), లోవ్‌లినా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), స్వేతా బోరా (81 కేజీలు), సీమా పునియా (81 కేజీలు) విభాగాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.