IPL 2021: కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభంకానుంది. అయితే అంతకంటే ముందే ధోని(Dhoni) నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings)కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు ఇద్దరు గాయాల బారిన పడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ప్రస్తుతం సీపీఎల్ 2021(CPL 2021)లో ఆడుతున్న బ్రావో(Bravo), డుప్లెసిస్(Duplessis) గాయపడగా.. ఇంగ్లండ్‌ క్రికెటర్లు సామ్ కరన్, మొయిన్ అలీలు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌కు దూరం కానున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాయం కారణంగా బ్రావో కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కానుండగా, పాకిస్తాన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో తగిలిన గాయం తిరగబెట్టడంతో డుప్లెసిస్‌ ఐపీఎల్‌ మొత్తానికే దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్(Sam Karan), మొయిన్ అలీ(Moin Ali)లు ఐపీఎల్ అనంతరం రెండు రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) కోసం బయో బబుల్‌లోకి వెళ్లిపోనున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం వారు మెగా టోర్నీ ​ప్రారంభానికి మందే ఇంగ్లండ్ బృందంలో చేరాల్సి ఉంది. ఇలా ఒకేసారి నలుగురు స్టార్‌ ఆటగాళ్లు దూరం కానుండడంతో సీఎస్‌కే టైటిల్‌ గెలవాలన్న ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి.


Also Read: T20 world cup 2021: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం! అసలేం జరిగిందంటే..


ఐపీఎల్ తొలి సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే మొదటి దశలో కీలకపాత్ర పోషించిన డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌లు కీలక దశలో జట్టును వీడితే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా, సెప్టెంబరు 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook