India Vs Pakistan Match: ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​ (ICC T20 World Cup 2021) వేదికగా మరో రెండు రోజుల్లో దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్​ (India vs Pakistan) మధ్య హైవోల్టేజ్​ మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​ కోసం ఇరు దేశాల క్రికెట్​ అభిమానులే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్​ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత కొన్నేళ్లుగా వన్డే, టీ20 వరల్డ్​ కప్​లలో ఏదైనా పాకిస్తాన్​పై టీమ్ఇండియా ఎక్కువ సార్లు ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలో టీ20 వరల్డ్​ కప్​లో భాగంగా ఆదివారం (అక్టోబరు 24) జరగనున్న మ్యాచ్​లో మరోసారి పాక్​ జట్టుపై ఇండియా జట్టు విజయం సాధిస్తుందా? అని టీమ్ఇండియా ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్​లో కచ్చితంగా గెలుపొందాలని పట్టుదలతో ఇరు జట్లు ప్రాక్టీస్​ చేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

​ఇండియా, పాకిస్థాన్​ మ్యాచ్​ నేపథ్యంలో భారత యువ బ్యాట్స్​మెన్​ కేఎల్​ రాహుల్​ (KL Rahul Batting Average), రిషభ్​ పంత్​లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, పాకిస్తాన్​ కోచ్​​ మాథ్యూ హెడెన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు నుంచి పాకిస్తాన్​ జట్టుకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపాడు.   


"నాకు తెలిసి టీమ్ఇండియా ఓపెనింగ్​ బ్యాటర్​ కేఎల్​ రాహుల్​ నుంచి పాకిస్తాన్​ టీమ్​కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే టీ20 ఫార్మాట్​లో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. మరోవైపు వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్​ నుంచి కూడా పాక్​ అవరోధాలు ఎదుర్కొవచ్చు. పంత్​ తనదైన శైలిలో నవ్వుతూ ఆడుతూనే.. ప్రత్యర్థి గెలుపు ఆశలను నాశనం చేస్తాడు" అని పాక్​ ప్రధాన కోచ్​​ మాథ్యూ హెడెన్​ అన్నాడు.  


పాకిస్తాన్​ టీమ్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​పై మాథ్యూ హెడెన్​ (Matthew Hayden News) ప్రశంసలు కురిపించాడు. అటు బ్యాటింగ్​లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. కెప్టెన్​గా ఒత్తిడిని ఎదుర్కొంటూ రాణిస్తున్నాడని ప్రశంసించాడు. అక్టోబరు 24న భారత్, పాక్‌ (India Vs Pakistan Match) మధ్య హై వోల్టెజీ మ్యాచ్ జరగనుంది. 


 


హిస్టరీ పరంగా చూస్తే.. ఇప్పటి వరకు ఇండియా - పాకిస్తాన్ జట్లు ఏడూ సార్లు ప్రపంచక‌ప్‌లో తలపడ్డాయి.. వీటిలో 5 మ్యాచ్‌లు టీ20 వరల్డ్ కప్ లు కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచక‌ప్‌లో ఏడూ సార్లు తడబడిన అన్ని మ్యాచుల్లో భారత్‌దే పై చేయిగా నిలిచింది.. ఈ సారి ఎలా అయిన హిస్టరీని తిరగ రాయలని పాకిస్తాన్ జట్టు వ్యూహాలు రచిస్తుంటే.. భారత్ మాత్రం ఈ సారి కూడా ఆధిపత్యం మాదే అంటూ దీమాగా ఉంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook