Matthew Wade Big Cheater: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌ పేరు మార్మోగిపోతోంది. ఏ డబుల్ సెంచరీనో లేదా అద్భుత క్యాచ్ పట్టినందుకో వేడ్‌ పేరు నెట్టింట చర్చనీయాంశం కాలేదు.. ఆసీస్ కీపర్ తొండాట ఆడాడు. క్యాచ్ పట్టబోయిన ఇంగ్లండ్ పేసర్ మార్క్‌ వుడ్‌ను తోసేసి.. ప్లేయర్స్, మాజీలు, అభిమానులు నివ్వెరపోయేలా చేశాడు. దాంతో మాథ్యూ వేడ్‌ పెద్ద చీటర్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ నుంచి ఆస్ట్రేలియాను బ్యాన్ చేసేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్‌ పర్యటిస్తోంది. ఆదివారం (అక్టోబర్‌ 9) తొలి మ్యాచ్‌ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అలెక్స్‌ హేల్స్‌ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఛేదనలో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి.. 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డేవిడ్‌ వార్నర్‌ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. 


ఈ మ్యాచులో బ్యాటర్ మాథ్యూ వేడ్, బౌలర్ మార్క్ వుడ్ మధ్య జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ధాటిగా ఆడుతోంది. విజయానికి 22 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో డేవిడ్ వార్నర్, మాథ్యూ వేడ్ ఉన్నారు. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ మూడవ బంతికి వేడ్‌ పుల్‌ షాట్‌ ఆడగా.. బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేచింది. వుడ్ దాన్ని అందుకోవడానికి పరిగెత్తగా.. వేడ్ రన్ తీయడానికి పరిగెత్తాడు. అవతలి ఎండ్‌లో ఉన్న వార్నర్ వద్దనడంతో.. వేడ్ క్రీజు వైపునకు పరుగెత్తాడు. గాల్లో ఉన్న బంతిని క్యాచ్ అందుకోవడానికి వుడ్ పరిగెత్తుకుంటూ రాగా.. వేడ్ తన చేతితో అడ్డుకున్నాడు. దాంతో వుడ్ క్యాచ్ అందుకోలేకపోయారు. వేడ్ ఔట్ అవ్వకుండా బతికిపోయాడు. 



మాథ్యూ వేడ్ ఉద్దేశపూర్వకంగానే మార్క్ వుడ్‌ను అడ్డుకున్నట్లు రిప్లేలో స్పష్టంగా తేలిందో. ఈ ఘటనతో యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఫీల్డర్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే.. బ్యాటర్‌ను ఔటివ్వాలని ఐసీసీ రూల్స్ చెబుతున్నా ఇక్కడ అది జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. వేడ్ తొండాట ఆడాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాథ్యూ వేడ్‌ పెద్ద చీటర్, క్రికెట్ నుంచి ఆస్ట్రేలియాను బ్యాన్ చేయండి అంటూ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 




Also Read: IND vs SA: శ్రేయాస్-ఇషాన్ సూపర్ బ్యాటింగ్‌.. సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలు!


Also Read: GodFather Collections : నెట్టింట్లో రామ్ చరణ్, చిరుపై ట్రోలింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook