Maxwell Wedding Card: ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. అది కూడా భారతీయ అమ్మాయిని పెళ్లాడనున్నాడు. తన పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారత సంతతి అమ్మాయి వినీ రామన్ తో 2020లో నిశ్చితార్థం జరిగింది. తమిళనాడుకు చెందిన వినీ రామన్.. తన సంప్రదాయం ప్రకారం వీరిద్దరి పెళ్లి జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాక్స్ వెల్, వినీ రామన్ ల వివాహం తమిళ బ్రహ్మణ సంప్రదాయం ప్రకారం జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి అంతర్జాతీయ క్రికెటర్లు, అతిథులు హాజరవనున్నారు. 2020 మార్చిలో మ్యాక్స్ వెల్, వినీ రామన్ ల నిశ్చితార్థం గతేడాది కరోనా లాక్ డౌన్ కు ముందు చెన్నైలో జరిగింది. అప్పుడు ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. 



రెండో ఆస్ట్రేలియన్ క్రికెటర్ గా..


భారతీయురాలిని పెళ్లాడని రెండో ఆస్ట్రేలియన్ క్రికెటర్ గా గ్లెన్ మ్యాక్స్ వెల్ నిలవనున్నాడు. అంతకుముందు 2014లో ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ భారత సంతతికి చెందిన మసూమ్ సింఘాను వివాహమాడాడు. ఐపీఎల్ సందర్భంగా కలుసుకున్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. 


మ్యాక్స్ వెల్ కు మద్దతుగా..


తమిళనాడుకు చెందిన వినీ రామన్.. ఆస్ట్రేలియాలో వైద్య విద్యను అభ్యసించింది. ప్రస్తుతం అదే దేశంలో వైద్యురాలిగా పనిచేస్తుంది. 2013లో ఓ ఈవెంట్ లో కలుసుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. గ్లెన్ మ్యాక్సె వెల్ ఫామ్ ను కోల్పోయిన సమయంలో వినీ రామన్ తనకు అండగా నిలిచిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆడుతున్నాడు.   


Also Read: SRH Full Squad: ముగిసిన ఐపీఎల్ 2022 వేలం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే! ఈసారైనా..!!


Also Read: IPL 2022 Auction: ముగిసిన ఐపీఎల్ వేలం.. 204 మంది ఆటగాళ్ల కోసం 550 కోట్లు ఖర్చు చేసిన 10 జట్లు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook