Sunrisers Hyderabad IPL 2022 Full Squad: బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం ముగిసింది. ఐపీఎల్ 2022లో పాల్గొననున్న 10 జట్లు 204 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందుకోసం అన్ని ప్రాంఛైజీలు 550.70 కోట్లు ఖర్చు చేశాయి. మెగా వేలంలో ఇషాన్ కిషన్ (రూ.15.25కోట్లు, ముంబైఇండియన్స్) అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా నిలవగా.. అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ (రూ. 11.50 కోట్లు, పంజాబ్ కింగ్స్) నిలిచాడు.
ఐపీఎల్ 2022 వేలంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సన్‌రైజర్స్ జట్టు పర్స్ వాల్యూలో ఇంకా రూ. 10 లక్షలు మిగిలాయి. 23 మందిలో ముగ్గురి ఆటగాళ్లను (కేన్ విలిమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్) వేలంకు ముందు అట్టిపెట్టుకోగా.. ఈ రెండు రోజుల్లో 20 మందిని తీసుకుంది. వేలంలో హైదరాబాద్ జట్టు చాలా మంది ఆల్‌రౌండర్‌లను తీసుకుంది. 7 మంది స్టార్ ప్లేయర్స్ విదేశీ ఆటగాళ్లు కావడమే ఇక్కడ మనకు కాస్త ప్రతికూలాంశం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కేన్ విలిమ్సన్, నికోలస్ పూరన్, మార్కో జాన్సెన్, రొమారియో షెఫెర్డ్, సీన్ అబాట్, ఐడెన్ మార్క్‌రామ్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి స్టార్ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో తుది జట్టులో ఆడేది నాలుగు మాత్రమే. సారథిగా కేన్, వికెట్ కీపర్‌గా పూరన్ కచ్చితంగా ఆడతారు. ఓపెనర్‌గా ఫిలిప్స్ ఆడితే.. మార్క్‌రామ్ దాదాపుగా బెంచ్‌కే పరిమితం అవుతాడు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో షెఫెర్డ్, జాన్సెన్, అబాట్‌లలో ఒకరికే అవకాశం ఉంటుంది.
కెప్టెన్ కేన్ మామకు రూ.14 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ జట్టు అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. వేలంలో విండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌కు రూ. 10.75 కోట్లు పెట్టింది. వీరి తర్వాత వాషింగ్టన్ సుంధర్ (రూ.8.75 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 8.50 కోట్లు), రొమారియో షెఫెర్డ్ (రూ.7.75 కోట్లు) అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు)లు ఉన్నారు. టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్ లాంటి బౌలర్లు తక్కువ ధరకే వచ్చారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ఫజల్హాక్ ఫరూకీ, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్.
Also Read: IPL 2022 Auction: ముగిసిన ఐపీఎల్ వేలం.. 204 మంది ఆటగాళ్ల కోసం 550 కోట్లు ఖర్చు చేసిన 10 జట్లు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook