MS Dhoni Record: ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు.. ఒకే ఒక్కడు!
IPL 2022, MI vs CSK: MS Dhoni Rare IPL record. ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు ఆందుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఓ ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్‌లో అత్యంత వేగంగా 100 పరుగుల చేసిన తొలి ఆటగాడిగా మహీ రికార్డుల్లో నిలిచాడు.
MS Dhoni becomes 1st batter to hits fastest 100 runs by an opposing bowler in IPL: ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం అందుకున్న విషయం తెలిసిందే. ముంబై నిర్ధేశించిన 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 7 వికెట్లు కోల్పోయి 20వ ఓవర్ చివరి బంతికి విజయం సాధించింది. చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (28; 13 బంతుల్లో 3x4, 1x6) చివరి ఓవర్లో 16 రన్స్ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంబటి రాయుడు (40; 35 బంతుల్లో 2x4, 3x6) టాప్ స్కోరర్.
ఈ మ్యాచులో ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు ఆందుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఓ ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్‌లో అత్యంత వేగంగా 100 పరుగుల చేసిన తొలి ఆటగాడిగా మహీ రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో సురేశ్ రైనా, ఏబీ డివిల్లియర్స్, కీరన్ పొలార్డ్‌లను వెనక్కి నెట్టిన మహీ.. అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ధోనీ 100 పరుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో ఉనద్కట్ బౌలింగ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న మహీ.. 100 పరుగుల మార్కును అందుకున్నాడు.
ఓ ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్‌లో అత్యంత వేగంగా 100 పరుగుల చేసిన ఆటగాళ్ల జాబితాలో మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా రెండో స్థానంలో ఉన్నాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో రైనా 47 బంతుల్లో 100 పరుగులు బాదాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లోనే మిస్టర్ 360 ఏబీ డివిల్లియర్స్ 47 బంతుల్లో 100 రన్స్ చేశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ 47 బంతుల్లో 100 పరుగులు బాదాడు. ముంబైతో జరిగిన మ్యాచులో 28 రన్స్ చేసిన ఎంఎస్ ధోనీ.. 42 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు.
జయదేవ్ ఉనద్కత్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికే డ్వేన్ ప్రిటోరియస్ ఔట్ కాగా.. రెండో బంతికి డ్వేన్ బ్రావో సింగిల్ తీశాడు. మూడో బంతిని లాంగాఫ్ మీదుగా సిక్సర్ బాదిన ఎంఎస్ ధోనీ.. నాలుగో బంతిని డీప్ ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాదాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీసి.. చివరి బంతిని లాంగ్ లెగ్‌లో బౌండరీ బాది చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడు మహీ.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ ముందు మోకరిల్లిన చెన్నై కెప్టెన్.. క్యాప్ తీసి సలాం కొట్టాడుగా! మహీనా మజాకా
Also Read: KGF 2 OTT Release: 'కేజీఎఫ్' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... చాప్టర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.