క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంబరం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) రేపటి (సెప్టెంబర్ 19) నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ (Mumbai Indians vs Chennai Super Kings)‌కు అబు దాబి వేదికగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభం దాదాపు 6 నెలలు ఆలస్యమైందని తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (IPL 2020 In UAE) వేదికగా ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. RCB in IPL 2020: స్థానికతకు ఆర్సీబీ ప్రాధాన్యం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిఫెండింగ్ ఛాంపియన్ vs​ టైటిల్ ఫెవరెట్..
ఐపీఎల్ 2020 తొలి తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)తో టైటిల్ ఫెవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన జట్ల మధ్య సమరం ఎప్పుడైనా సవాల్ లాంటిది. ముఖ్యంగా ముంబై, చెన్నై జట్ల మధ్య మ్యాచ్.. ప్రతిసారి ఓ సెమీఫైనల్స్, లేక ఫైనల్ మ్యాచ్ చూస్తున్న అనుభూతిని అభిమానులు పొందుతారు. CSK In IPL 2020: సీఎస్కేను వీడని కరోనా కష్టాలు


 నాలుగు ఐపీఎల్ టైటిళ్లతో ముంబై అగ్రస్థానంలో ఉండగా.. సీఎక్కే మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ భీకర జట్టుగా మారింది. ఆరంభ సీజన్లలో కెప్టెన్సీ చేయకున్నా.. అనంతరం కాలంలోనే ముంబై పగ్గాలు అందుకుని జట్టును విజయపథంలో నడిపించిన ఘనత రోహిత్ శర్మ సొంతం.


ఎనిమిది ఫైనల్స్ ఆడిన చెన్నై
ఐపీఎల్ తొలి సీజన్ నుంచే చెన్నై జట్టు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారింది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీనే అందుకు కారణం. రికార్డు స్థాయిలో 8 పైనల్స్ ఆడిందంటేనే ధోనీ నాయకత్వ ప్రతిభను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయవంతంగా 3 ఐపీఎల్ టైటిల్స్ నెగ్గింది సీఎస్కే. కాగా, రెండేళ్ల పాటు (2016, 17) సీజన్లలో నిషేధం ఉంది. ఆ తర్వాత బరిలోకి దిగి మునుపటిలా దూసుకెళ్తోంది చెన్నై.  


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR