Mithali Raj Political Entry: జేపీ నడ్డాను కలవన్న మిథాలీ రాజ్.. బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా?
BJP National President JP Nadda to meet Mithali Raj. టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారా.. మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
BJP National President JP Nadda to meet Mithali Raj: టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారా.. మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్టంలో ఇదే హాట్ టాపిక్ అయింది. బీజేపీలో మిథాలీ చేరనున్నారని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.. మిథాలీ శనివారం బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తున్నారట. దాంతో ఇప్పటికే క్రికెట్ నుంచి తప్పుకున్న మిథాలీ.. ఇక రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
శనివారం తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన ఉన్న విషయం తెలిసిందే. హన్మకొండలో జరగనున్న ప్రజా సంగ్రమయాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రమయాత్ర మూడో దశ ముగింపు సభ ఉంది. ఈ సభ కోసమే జేపీ నడ్డా రేపు హన్మకొండ వస్తున్నారు. ఈ సభ ముందు లేదా అనంతరం హైదరాబాద్‌లో మిథాలీ రాజ్‌ను జేపీ నడ్డా కలుస్తారని సమాచారం తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
మరోవైపు టాలీవుడ్ యువ హీరో నితిన్‌తో కూడా జేపీ నడ్డా భేటీ అవ్వనున్నారని తెలుస్తోంది. శనివారం రాత్రి హైదరాబాద్ నోవోటెల్‌లో వీరిద్దరూ కలుసుకోనున్నారట. తాజాగా టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌తో కేంద్ర హోమంత్రి అమిత్ షా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నితిన్‌తో నడ్డా సమావేశం అవుతున్నారు. టాలీవుడ్ హీరోలతో బీజేపీ నేతల వరుస భేటీలు అందరిలో పాల అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. బీజేపీ ప్లానింగ్ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు.
Also Read: పాకిస్తాన్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డును అందుకోనున్న విరాట్ కోహ్లీ! రెండో ప్లేయర్‌గా చరిత్ర
Also Read: కోబ్రా ట్రైలర్ వచ్చేసింది.. 'అపరిచితుడి'ని మించిపోయిందిగా! తళుక్కుమన్న క్రికెటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook