Mithali Raj says It is very sad not to win ODI World Cup: జూన్ 8న టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 1999లో 16 ఏళ్ల వ‌య‌సులో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. భారత్ తరఫున 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కొనసాగించారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతలను అందుని మహిళల క్రికెట్‌పై ఆదరణ పెరగడంలో కీలక పాత్ర పోషించారు.  మిథాలీ కెరీర్  ఎందరో యువ మహిళలకు ఓ స్ఫూర్తి. అయితే అంతటి దిగ్గజ క్రికెటర్‌ తన కల నెరవేరకుండానే.. రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా మిథాలీ రాజ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'రిటైర్మెంట్ నిర్ణయం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. చాలా రోజులుగా ఆలోచించా. వన్డే ప్రపంచకప్‌లో మాకు నిరాశ తప్పలేదు. దాని నుంచి బయటపడేందుకు సమయం పట్టింది. ప్రపంచకప్‌ సాధించాలని ఎప్పటినుంచో కల కన్నా. ఇప్పుడు మరో ప్రపంచకప్‌ ఆడే పరిస్థితి లేదు. ఇంతకాలం ఏ లక్ష్యంతో క్రికెట్ ఆడానో దాన్ని అందుకోలేకపోయాను. చాలా భాధగా ఉంది. నాకు ఇంకొంతకాలం ఆడే సత్తా ఉన్నప్పటికీ వీడ్కోలు పలికా' అని అన్నారు. 


'సుదీర్ఘ  క్రికెట్ కెరీర్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులను చూశాను, ఎన్నో విజయాలు అందుకున్నా. భారత జెర్సీ వేసుకుని మైదానంలో బరిలో దిగితే.. ఆ అనుభూతే చాలా ప్రత్యేకం. దేశం కోసం ఇన్నేళ్లు క్రికెట్ ఆడినందుకు ఆనందంగా ఉంది. ప్రపంచకప్‌ గెలవలేదన్న అసంతృప్తి తప్ప మిగతాదంతా బాగుంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే.. వచ్చే అయిదేళ్లలో భారత్‌ను అగ్రస్థానంలో చూడొచ్చు. ప్రస్తుతం జట్టులో నాణ్యమైన యువ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. మహిళల క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉంది' అని మిథాలీ రాజ్ పేర్కొన్నారు. 


మిథాలీ రాజ్ భారత్ తరఫున 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 669, వన్డేలలో 7805, టీ20లలో 2364 పరుగులు చేశారు. అన్ని ఫార్మాట్లలో కలిసి మిథాలీ 8 సెంచరీలు చేశారు. 7 సెంచరీలు వన్డేల్లో చేయగా.. ఒకటి టెస్టులో బాదారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు (10,686) మిథాలీదే. 39 ఏళ్ల మిథాలీ జీవితంలో 30 సంవత్సరాలు క్రికెట్టే ఉండడం విశేషం. 


Also Read: Ram Charan-Upasana: వెకేషన్‌లో రామ్‌ చరణ్‌, ఉపాసన.. పదో వెడ్డింగ్‌ యానివర్సరీ కోసం స్పెషల్‌గా ప్లాన్!


Also Read: Kethika Sharma: కేతిక శ‌ర్మ‌కు బంపర్ ఆఫర్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.