24వ అంతస్తు నుంచి దూకేస్తానని భయపడ్డారు: మహ్మద్ షమీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సహచర ఆటగాడు రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పలు వ్యక్తిగత సమస్యలపై స్పందించాడు. Shami thought of committing suicide
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సహచర ఆటగాడు రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పలు వ్యక్తిగత సమస్యలపై స్పందించాడు. ఆఖరికి తాను ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు నిర్ణయించుకున్న విషయాన్ని చెప్పేసరికి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. 2015 వరల్డ్ కప్‌లో భాగంగా గాయపడ్డ షమీకి 18 పూర్తిగా నయం కావడానికి 18 నెలలు పట్టిందని.. తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం అదేనని పేర్కొన్నాడు బౌలర్ మహ్మద్ షమీ.
‘2015లో నేను గాయపడ్డాను. ఏడాదిన్నర పాటు క్రికెట్‌కు దూరమయ్యా. సరిగ్గా భారత జట్టులో తిరిగి చోటు సంపాదించే సమయంలో వ్యక్తిగత సమస్యలు వేధించాయి. భార్య వేధింపులు బాధించాయని, మరోవైపు ఈ విషయాలు పదే పదే ప్రచారం కావడంతో ఇబ్బందులకు గురయ్యాను. ఒత్తిడి తట్టుకోలేక ఒకనొక దశలో నేను మా 24వ అంతస్తు నుంచి దూకేస్తామోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
కొన్ని సందర్భాలలో ఇద్దరు, ముగ్గురు స్నేహితులు 24 గంటలు నా పక్కనే ఉండి కాపలాకాశారు. నా కుటుంబం మద్దతు వల్లే క్రికెట్‌లో రాణించాను. ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడగలిగాను. వ్యక్తిగత సమస్యలు, కెరీర్ పోతుందేమోనన్న భయం, ఒత్తిడి కారణంగా అత్మహత్య చేసుకోవాలని మూడు పర్యాయాలు భావించాను. కానీ కుటుంబం అండగా నిలవడంతో మళ్లీ క్రికెట్ మీద ఫోకస్ చేయగలిగాను. డెహ్రాడూన్ క్రికెట్ అకాడమీ చెమటోడ్చాను. క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
అంతా ఓకే అనుకున్న సమయంలో 2018 మార్చి నెలలో భార్య హసీన్ జహాన్ నాపై వేధింపుల ఆరోపణలు చేయడంతో పాటు కేసు నమోదు చేసింది. అసలే అది ఐపీఎల్ టైమ్. అదే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాను. భార్య వేధింపులు, రోడ్డు ప్రమాదం, బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కుతుందా, ఐపీఎల్ ఆడతాడా అంటూ మీడియా కథనాలతో విసిగెత్తిపోయానంటూ’ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మహ్మద్ షమీ పలు విషయాలు ప్రస్తావించాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!