Suryakumar Yadav hits Three Centuries in T20 Cricket, Rohit Sharma in Top: శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్‌ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం 45 బంతుల్లోనే సూర్య సెంచరీ సాధించాడు. మొత్తంగా 51 బంతుల్లో 9 సిక్స్‌లు, 7 ఫోర్ల సాయంతో 112 పరుగులు చేశాడు. 'మిస్టర్‌ 360' సూర్య లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. అతడు కొట్టే ప్రతి షాట్‌ను ఫాన్స్ ఎంజాయ్ చేశారు. సూర్యకుమార్‌ అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా భారత్‌ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవరాల్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌కు ఇది మూడో అంతర్జాతీయ సెంచరీ. ఈ మూడు సెంచరీలు కూడా టీ20ల్లో సాధించడం విశేషం. సూర్య ఇప్పటివరకు టీ20ల ద్వారానే మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సూర్య 3 సెంచరీలు చేసినా.. టీ20లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు. రోహిత్ టీ20ల్లో ఏకంగా 4 సెంచరీలు బాదాడు. టీ20లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాను ఓసారి చూద్దాం. 


రోహిత్ శర్మ:
భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు టీ20ల్లో సెంచరీలు చేశాడు. ప్రపంచంలోనే పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ కంటే ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ మరొకరు లేరు.


గ్లెన్ మాక్స్‌వెల్:
ఆస్ట్రేలియన్ పవర్ హిటర్ గ్లెన్ మాక్స్‌వెల్ టీ20ల్లో మూడు సెంచరీలు చేశాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో బ్యాటర్ మ్యాక్సీ. 


కోలిన్‌ మున్రో:
న్యూజిలాండ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ కోలిన్‌ మున్రో కూడా టీ20ల్లో మూడు సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో మున్రో మూడో స్థానంలో ఉన్నాడు. 


సూర్యకుమార్ యాదవ్:
శ్రీలంకపై సెంచరీతో టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన రెండో భారతీయుడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. మొత్తంగా టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. 


బ్రెండన్ మెకల్లమ్:
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పొట్టి ఫార్మాట్‌లో రెండు సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో మెకల్లమ్ టాప్ 5లో ఉన్నాడు. 


Also Read: Rainbow Dolphin VIral Video: ఇంద్రధనస్సుపై నుంచి దూకిన డాల్ఫిన్.. మంత్రముగ్దులను చేసే వీడియో! తప్పక చూడాల్సిందే


Also Read: Venus Saturn Transit 2023: శుక్ర శని గోచారం 2023.. ఈ 5 రాశుల వారు 10 రోజుల పాటు నోట్ల కట్టలతో ఆడుకోవడం పక్కా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.