MS Dhoni changes his official Instagram profile picture: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సంబరాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 2 మరియు 15 మధ్య తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్‌గా 'తిరంగ' (భారత జెండా త్రివర్థ పతాకం)ను ఉంచాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. దాంతో ప్రతి ఒక్కక్కరు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భారతీయత ఉట్టిపడేలా త్రివర్ణాలతో కూడిన డీపీలు పెడుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఈ జాబితాలో చేరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో డిస్‌ప్లే పిక్చర్‌గా మువ్వన్నెల జెండాను తాజాగా పెట్టుకున్నారు.  'mahi7781' పేరుతో ధోనీకి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఉన్న విషయం తెలిసిందే. 'భారతీయుడిని అయినందుకు నా జన్మ ధన్యమైంది' అనే అర్థం వచ్చేలా.. సంస్కృత, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఓ కోట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ డీపీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన మహీ ఫాన్స్.. తాము కూడా ఇలాంటి డీపీనే పెడతామని కామెంట్లు చేస్తున్నారు.


అత్యుత్తమ కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉంటారు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత మహీ సొంతం. ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు. ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. క్రికెట్‌లో మహీ సేవలను గుర్తించిన కేంద్రం అతడికి టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కల్పించిన విషయం తెలిసిందే.


భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చారు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 350 వన్డేల్లో 10,773 రన్స్‌ బాదారు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్థ శతకాలు ఉన్నాయి. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,617 పరుగుల చేశారు. మరోవైపు ఐపీఎల్ టోర్నీలో 234 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4,978 రన్స్ బాదారు.


Also Read: సీఎస్ఏ టీ20, ఐఎల్ టీ20లో ఎంఎస్ ధోనీ ఆడుతాడా.. పూర్తి క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!


Also Read: RBI Instructions: లోన్ రికవరీ ఏజెంట్స్‌కు ఆర్‌బీఐ వార్నింగ్.. ఈ రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook