ఎంతో నైపుణ్యమున్న భారత యువ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) రాణించకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ (MSK Prasad) స్పందించారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)తో పోలిక వల్లే పంత్‌పై ఒత్తిడి పెరిగిందని అభిప్రాయపడ్డాడు. అయితే ధోనీని అనుసరించడం మానేసి తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాట్లు చేసుకోవడం పంత్ ముందున్న సవాల్ అన్నాడు. రిషభ్ పంత్ మైదానంలోకి ఒక షాట్ కొట్టగానే ధోనీతో పోలిక తెచ్చేవారు, దీని వల్ల అతడు ఆటలో ముందుకు వెళ్లలేకపోతున్నాడని చీఫ్ సెలెక్టర్ పేర్కొన్నాడు. Sravani Suicide Case: ప్లీజ్ దేవా, నన్ను వదిలేయ్.. దేవరాజ్‌ను వేడుకున్న శ్రావణి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రాక్టీస్ సెషన్‌లో పంత్ సిక్సర్లతో చెలరేగుతున్నాడు. అయితే భారత జట్టు తరఫున రాణించాలంటే ధోనీతో పోలికను మరిచిపోవాలని, తన కంటూ శైలిని ఏర్పాటు చేసుకుంటేనే పంత్ రాణించగలడని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై పంత్‌ను హెచ్చరించాం, పలుమార్లు చెప్పి చూశామన్నాడు. నీలో ఉన్న ప్రతిభను బయటకు తీయాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఎవరూ సహాయం చేయలేరని సూచించినట్లు వివరించాడు. Alla Ramakrishna Reddy: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కేకి కరోనా పాజిటివ్


ధోనీ ఎలాగూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు కనుక.. పంత్‌కు నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయమని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. ధోనీ లాంటి గొప్ప ఆటగాడితో పోలిక పంత్ కెరీర్‌ను నాశనం చేస్తుందని పేర్కొన్నాడు.  Mahesh Babu New Look: మహేష్ బాబు న్యూ లుక్ చూశారా..?


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR