Watch: `ధోని` నామస్మరణతో మార్మోగిపోయిన చెపాక్ స్టేడియం.. దెబ్బకు చెవులు మూసుకున్న రస్సెల్.. వైరల్ అవుతున్న వీడియో..
IPL 2024: కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో చెపాక్ స్టేడియం మెుత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. ఆ రీసౌండ్ కు కేకేఆర్ ఫీల్డర్ ఆండ్రీ రస్సెల్ అయితే ఏకంగా చెవులు మూసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.
MS Dhoni Mania In MA Chidambaram Stadium: ఐపీఎల్ 17 సీజన్ యమ రంజుగా సాగుతోంది. జట్లన్నీ నువ్వా-నేనా అన్న రీతిలో తలపడుతూ క్రికెట్ ఫ్యాన్స్ కు మజా ఇస్తున్నాయి. ఇప్పటి వరకు 22 మ్యాచులు జరిగాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ అట్టడుగున ఉంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పై చెన్నై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ కు వచ్చాడు. ఇక అప్పుడు చూడాలి స్టేడియం మెుత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. ధోనీ.. ధోనీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మహి ఫ్యాన్స్. ధోని మేనియాతో స్టేడియం మెుత్తం దద్దరిల్లిపోయింది. ఆ సౌండ్ కు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్ ఫ్లేయర్ ఆండ్రీ రస్సెల్ ఏకంగా చెవులు మూసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 34 పరుగులు, నరైన్ 27 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో ఆ జట్టు ఓ మోస్తరు స్కోరు సాధించింది. అనంతరం ఛేజింగ్ కు దిగిన సీఎస్కే 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన ధోని 3 బంతుల్లో 1 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కేకేఆర్ రెండో స్థానంలోనూ, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నాయి.
Also read: Happy Ugadi 2024: తెలుగులో ఉగాది శుభకాంక్షలు చెప్పిన సన్ రైజర్స్ ఆటగాళ్లు, వీడియో వైరల్
Also Read: Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. IPLలో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్క ఫ్లేయర్ గా ఘనత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి