మహేంద్ర సింగ్ ధోని క్రికెట్‌కి వీడ్కోలు పలికిన అనంతరం రాజకీయాల్లో చేరొచ్చని కేంద్ర మాజీ మంత్రి, బీజేపి నేత సంజయ్ పాశ్వాన్ అన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సి IANSతో మాట్లాడుతూ.. టీమిండియాకు కెప్టేన్‌గా దేశానికి ఎన్నో విజయాలను అందించిన క్రికెట్ లెజెండ్ ధోని క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన అనంతరం నరేంద్ర మోదీ టీమ్‌లో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ధోని బీజేపిలో చేరొచ్చని, ఈ విషయమై చాలా కాలంగా చర్చ కూడా జరుగుతోందని సంజయ్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. అయితే, నిర్ణయం ఏదైనా ఆయన రిటైర్‌మెంట్ తర్వాతే తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టంచేశారు.


ధోనీ తనకు చాలా కాలంగా తెలుసునని, ఆయన తనకు మంచి మిత్రుడని చెబుతూ.. ధోని రిటైర్‌‌మెంట్ తర్వాత అతడిని బీజేపిలోకి తీసుకొచ్చేందుకు ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నట్టు పాశ్వాన్ తెలిపారు.