కల్నల్ హోదాలో పద్మభూషణ్ అందుకున్న ఎం ఎస్ ధోని..!
భారత క్రికెటర్ ఎం ఎస్ ధోని ఈ రోజు కల్నల్ హోదాలో.. ఆర్మీ డ్రెస్ ధరించి.. మార్చింగ్ చేస్తూ వచ్చి రాష్ట్రపతి నుండి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
భారత క్రికెటర్ ఎం ఎస్ ధోని ఈ రోజు కల్నల్ హోదాలో.. ఆర్మీ డ్రెస్ ధరించి.. మార్చింగ్ చేస్తూ వచ్చి రాష్ట్రపతి నుండి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంఘటన పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన అద్భుత నాయకత్వ ప్రతిభతో పాటు ప్రపంచ కప్‌లో జట్టును స్ఫూర్తివంతంగా ముందుకు నడిపించినందుకు ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఇవ్వాలని సిఫార్సు చేస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా గతంలో రక్షణ శాఖకు లేఖ రాశారు. ఆ తర్వాత టెరిటోరియల్ ఆర్మీ, ధోనికి ఆ హోదాను కల్పించింది. అప్పటికే ఆయన టెస్టు క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. కల్నల్ హోదా పొందాక ధోని.. ఆగ్రాలోని పారా రెజిమెంట్‌లో రెండు వారాల పాటు మిలిటరీ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అదే హోదాలో ఆయన ఆ తర్వాత శ్రీనగర్‌లోని ఆర్మీ పబ్లిక్ పాఠశాలను కూడా సందర్శించారు.