భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై  హైదరాబాదీ మాజీ భారత క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండో టీ20 మ్యాచ్ లో ఆశించినంతగా రాణించపోవడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయన స్పందించడం  గమనార్హం. 


"లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 160 గా ఉంది. ధోనీది స్ట్రైక్ రేట్ 80 ఉంది. అంతటి భారీ లక్ష్యాన్ని చేధించేటప్పుడు ఈ స్ట్రైక్ రేట్ ఎంతమాత్రం సరిపోదు. ధోనీ టీ20లలో ఇక  కుర్రాళ్లకు అవకాశం ఇస్తే మంచిదని నా ఉద్దేశం. ఐతే అతను వన్డేలలో అంతర్భాగం" అని లక్ష్మణ్ పేర్కొన్నారు. టీ20 మ్యాచ్ లలో ధోనీకి ప్రత్యామ్నాయం చూడాలని మరో క్రికెటర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు.