MS Dhoni Bike Video: సెక్యూరిటీ గార్డుకు లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్
MS Dhoni Old Video Viral: ఎంఎస్ ధోనీకి సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన ఫామ్ హౌస్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డును ఎంట్రన్స్ గేట్ వరకు ధోనీ డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.
MS Dhoni Old Video Viral: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆటతీరుతోనే కాదు.. తన మంచితనంతో భారీగా అభిమానులను సంపాదించకున్నాడు. అందుకే ధోనీ అంటే ప్రత్యర్థి ఆటగాళ్లకు సైతం ఎంతో గౌరవం. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సెక్యూరిటీ గార్డుకు ధోనీ లిఫ్ట్ ఇస్తూ కనిపిస్తున్నాడు. సెక్యూరిటీ గార్డును బైక్‌పై వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎంఎస్ ధోనీ ఫామ్ హౌస్ వీడియో అని ప్రచారం జరుగుతోంది.
ఫామ్ హౌస్‌లో బనియన్‌తో ఉన్న ధోనీ బైక్ నడుపుతున్నాడు. గేట్ దగ్గర బైక్ ఆపగా సెక్యూరిటీ గార్డు బైక్ నుంచి కిందకు వెళ్లిపోయాడు. ధోనీ ఇంటికి ఎంట్రన్స్ గేట్‌కు ఎక్కువ దూరం ఉందని.. అందుకే ధోని బైక్ డ్రాప్ చేశాడని అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడయోను ఎవరో తీసి నెట్టింట పోస్ట్ చేయగా.. అభిమానులు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాంచీలో ధోనికి భారీ ఫామ్‌హౌస్ ఉన్న విషయం తెలిసిందే. ఇది దాదాపు 7 ఎకరాలలో విస్తరించి ఉన్నట్లు సమాచారం. కోట్లు ఖర్చు చేసి ప్రకృతిని ఆస్వాదించేవిధంగా ధోనీ తన ఇంటిని కట్టించుకున్నాడు. ఈ ఇంటికి కైలాశపతి అని పేరు కూడా పెట్టాడు.
2017లో రాంచీలో ఈ ఫామ్‌హౌస్ కట్టించుకోగా.. ఇంటి నిర్మాణానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఎంతో విలాసవంతంగా.. చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా చెట్లు ఉన్నాయి. ఈ ఫామ్‌హౌస్ పిక్స్‌ను ధోనీ భార్య సాక్షి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వీకెండ్స్‌లో ధోని కుటుంబంతో ఎక్కువగా ఇక్కడే గడుపుతాడు. జిమ్, స్విమ్మింగ్ పూల్, పెద్ద లాన్, బ్యూటీఫుల్ ల్యాండ్‌స్కేప్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. ధోనీ కూతురు జివా ఆడుకుంటున్న ఫొటోలను సాక్షి షేర్ చేశారు.
రాంచీలో మ్యాచ్‌లు జరిగే సమయంలో టీమిండియా ఆటగాళ్లను తన ఫామ్ హౌస్‌కు ఆహ్వానిస్తుంటాడు ధోనీ. హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. కుటుంబంతో ఇక్కడికి వచ్చి ధోనీ హాయిగా ఉంటాడు. అంతేకాదు వివిధ రకాల పక్షులు, జంతువులను ఫామ్‌హౌస్‌లో ధోనీ పెంచుకుంటున్నాడు. విదేశీ జాతులకు చెందిన పక్షులు, రంగురంగుల చిలుకలు ఉన్నాయి.
Also Read: Jonny Bairstow Controversial Run Out: ఊహించని రీతిలో బెయిర్ స్టో రనౌట్.. ఫస్ట్ టైమ్ ఇలా..
Also Read: Telangana Politics: అవినీతికి కాంగ్రెస్ రారాజు.. అందుకే రాహుల్ గాంధీ ఓడిపోయారు: మంత్రులు ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook