MI: ఐపీఎల్ 2020లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఐదుసార్లు టైటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్ వరుసగా మూడింట ఓటమి చవిచూసింది. ఊహించని ఓటమి పరిణామాలపై ఆ టీమ్ సారధి ఏమంటున్నాడో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 ఈసారి చాలా ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటివరకూ అత్యధికంగా ఐపీఎల్ టైటిల్ గెల్చిన చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈసారి ఘోరంగా విఫలమౌతున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లు ఆడి..మూడింట్లోనూ ఓటమి పాలైంది. అటు ముంబై ఇండియన్స్ కూడా అదే పరిస్థితి. మూడింట మూడూ ఓడిపోయింది. అనూహ్యంగా కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.


నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను సైతం చివరి ఓవర్లలో కోల్పోయింది. విజయం ఖాయమనే ధీమాలో ఉన్న ముంబై ఇండియన్స్‌పై ప్యాట్ కమ్మిన్స్ నీళ్లు పోశాడు. వీరవిహారం చేసి సునామీ ఇన్నింగ్స్‌తో 14 బంతుల్లో 50 పరుగులు చేయడం ద్వారా జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ ప్రణాళికల్ని గ్రౌండ్‌లో అమలు చేయడంలో విఫలమయ్యానని చెప్పుకొచ్చాడు. కమ్మిన్స్ ఇంతగా విజృంభిస్తాడని ఊహించలేదన్నాడు.15వ ఓవర్ వరకూ ఆట తమ చేతిలోనే ఉందని..కమిన్స్ వచ్చి మొత్తం చిన్నభిన్నం చేశాడని చెప్పాడు రోహిత్. 


ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగానే ఉందన్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సరిగ్గా రాణించలేదన్నాడు. ప్రతిసారీ ఓడిన కెప్టెన్ స్థానంలో ఉండాలనుకోవడం లేదని ఆవేదన చెందాడు. వరుస ఓటముల అసహనం కూడా రోహిత్ శర్మలో కన్పిస్తోంది. 


Also read: MI vs KKR: తుపాను ఇన్నింగ్స్‌తో బీభత్సం చేసిన ప్యాట్ కమిన్స్, ముంబైకు మూడో ఓటమి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook