MI vs KKR: ఐపీఎల్ 2022లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఐదు సార్లు టెటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలమవుతోంది. ప్యాట్ కమిన్స్ సునామీలా విరుచుకుపడటంతో మరో ఓటమి చవిచూసింది.
ఐపీఎల్ 2022లో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ అభిమానులకు చాలా కిక్ ఇచ్చిందనే చెప్పాలి. తుపాను ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందనేది ప్రేక్షకులు చూశారు. సునామీ ఇన్నింగ్స్ ఆడితే ఆట స్వరూపం ఎలా మారుతుందనేది తెలిసింది.
నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇన్నింగ్స్ పేలవంగానే ప్రారంభించింది. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది.13 ఓవర్లకు ఐదు వికెట్ల ుకోల్పోయింది. ఓ దశలో ముంబై ఇండియన్స్ విజయం ఖాయమనే అంతా అనుకున్నారు. అప్పుడు రంగ ప్రవేశం చేసిన ప్యాట్ కమ్మిన్స్ ధాటికి ఫలితమే మారిపోయింది.
సునామీ ఇన్నింగ్స్ అంటే ఏంటనేది చూపించాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా వచ్చిన ప్రతి బాల్‌ను సిక్సర్ లేదా బౌండరీగా మార్చేశాడు. కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన యూసుఫ్ పఠాన్, సునీల్ నరైన్ పేరిట ఉంది. ప్యాట్ కమిన్స్ ఒకే ఓవర్లో 35 పరుగులు సాధించాడు. ఓ దశలో ప్యాట్ కమిన్స్ చెలరేగి ఆడుతున్న ఓవర్లో..సూర్యకుమార్ అద్భుతంగా క్యాచ్ పట్టినా..నో బాల్ కావడంతో లైఫ్ వచ్చినట్టైంది.
ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్‌కు ఇదే తొలి మ్యాచ్. ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటన కారణంగా, తరువాత షేన్‌వార్న్ అంత్యక్రియల కారణంగా ఆలస్యంగా జట్టులో చేరాడు. క్వారంటైన్ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి కొన్ని మ్యాచ్‌లు మిస్సయ్యాడు. వచ్చీ రాగానే తొలి మ్యాచ్‌లో సునామీ రప్పించాడు. కేకేఆర్‌కు మరో విజయాన్ని అందించాడు.
Also read: KKR vs MI: టాస్ గెలిచిన కోల్‌కతా.. సూర్య వచ్చేశాడు! ముంబై బోణి కొట్టేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook