IPL 2024-Hardik Pandya: ఎందుకో ఈ ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యాకు అసలు కలిసిరావడం లేదు. మనోడుకు వరుసగా షాక్ లు మీద షాకులు తగులుతున్నాయి. ఒకవైపు కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమవుతున్నాడని వరుస విమర్శలు ఎదుర్కొంటున్న ఈ ముంబై కెప్టెన్ కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడిపై ఏకంగా రూ.24 ల‌క్ష‌ల ఫైన్ ప‌డింది. ఈ మెగా టోర్నీలో పాండ్యాకు ఇది రెండో జరిమానా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాండ్యాకు భారీగా ఫైన్..
మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లు కోటాను పూర్తి చేయలేకపోయింది. దాంతో మ్యాచ్ రిఫరీ పాండ్యాపై బీసీసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అతడికి రూ.24 లక్షల ఫైన్ వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అంతేకాకుండా జట్టులోని మిగతా పది మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.6లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఈ మెుత్తం అమౌంట్ ను బీసీసీఐకి ముంబై ఫ్రాంచైజీ చెల్లించ‌నుంది.


మరోసారి ఇలా చేస్తే..ఇక అంతే
ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ సేన నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. అప్పుడు హార్ధిక్ కు రూ. 12 లక్షల ఫైన్ వేశారు. హార్దిక్ పాండ్యా ఇదే తప్పును మూడోసారి పునరావృతం చేస్తే ఒక్క మ్యాచ్ నిషేధం విధిస్తారు. తాజాగా జరిమానాతో పాండ్యా మెుత్తం రూ.36 లక్షల జరిమానా చెల్లించాడు. ముచ్చటగా మూడోసారి అదే మిస్టేక్ రిపీట్ చేస్తే రూ.30 లక్షలు జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోంటాడు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఫ్లే ఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ప్రస్తుతం పరువు కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత మ్యాచ్ మే 3న‌ కేకేఆర్ తో ఆడబోతుంది ముంబై. 


Also Read: T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ లో సెమీపైనల్ కు వెళ్లేది ఆ నాలుగు జట్లే.. టీమిండియాకు నో ఛాన్స్!


Also Read: IPL 2024 Updates: 'ఈ ఐపీఎల్ సీజన్ లో ఆ రెండు జట్లతోనే మాకు పోటీ'..: కమిన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter