Wasim Jaffer says If Mayank Agarwal out Wriddhiman Saha will play as openar: కాన్పూర్‌ వేదికగా న్యూజీలాండ్, భారత్ జట్లు తొలి టెస్ట్ ఆడుతున్నాయి. ఈ రోజుతో ముగియనున్న మ్యాచులో గెలిచేందుకు ఇరు జట్లకు సమన అవకాశాలు ఉన్నాయి. ముంబై వేదికగా వచ్చే నెల 3 నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) తుది జట్టులోకి రానున్న నేపథ్యంలో.. ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. కోహ్లీ రాకతో తాతాల్కిక కెప్టెన్‌ అజింక్య రహానే (Ajinkya Rahane)పై వేటుపడే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే గతేడాది మెల్‌బోర్న్‌ టెస్టు తర్వాత జింక్స్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఫామ్‌ కోల్పోయి పూర్తిగా విఫలమవుతున్న రహానేను రెండో టెస్టుకు దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయని క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అజింక్య రహానే విఫలమయిన విషయం తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 39 పరుగులే చేశాడు. మరోవైపు ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్ (Mayank Agarwal) కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో 30 పరుగులు మాత్రమే చేశాడు. ఇద్దరు గత కొంతకాలంగా పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నారు. దాంతో ముంబై టెస్టుకు వీరిద్దరిలో ఒకరిపై వేటు పడే వీలుంది. ఇదే విషయంపై భారత మాజీ బ్యాటర్ వసీమ్‌ జాఫర్‌ (Wasim Jaffer) స్పందించాడు. ముంబై టెస్టులో రహానే, అగర్వాల్‌లలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాల్సి వస్తే అది కష్టమైన నిర్ణయమన్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే స్వయంగా తేల్చుకోవాల్సిన విషయమని ఆయన పేర్కొన్నాడు.


Also Read: The Ghost: కాజల్‌, అమలా కాదు.. నాగార్జునకు జోడీగా నటించేదెవరో తెలుసా?


వసీమ్‌ జాఫర్‌ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ... 'ముంబై టెస్టుకు మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) మరియు అజింక్య రహానే (Ajinkya Rahane)లలో ఒకరిని మాత్రమే ఎంచుకోవడం కఠినమైన నిర్ణయం. ఈ విషయం కెప్టెన్ విరాట్ కోహ్లీకి పెద్ద తలనొప్పే. నేను ఇద్దరి గురించి ఆలోచిస్తాను. మయాంక్‌ను ఆడించి మరో అవకాశం ఇవ్వాలనుకున్నా.. రహానేను కొనసాగించి చూడాలనుకున్నా అది కోహ్లీ ఇష్టం. ఇందులో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కష్టమైనదే. అయితే మెల్‌బోర్న్ టెస్టు తర్వాత రహానే గత 10-12 టెస్ట్ మ్యాచ్‌లలో పరుగులు చేయలేకపోయాడు. బహుశా అతడిపై వేటుపడొచ్చు' అని అన్నాడు. 


Also Read: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలేంటి, ఏ వయస్సువారికి ప్రమాదకరం


'ఒకవేళ మయాంక్‌ అగర్వాల్‌ను పక్కనపెడితే మాత్రం వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha)ను ఓపెనింగ్‌కు పంపాలని కోరుకుంటా. అలా చేస్తే మిగతా బ్యాటర్లు అందరూ ఎప్పటిలాగే తమ స్థానాల్లో యధావిధిగా కొనసాగుతారు. చేతేశ్వర్ పుజారా (Pujara), అజింక్య రహానే, విరాట్ కోహ్లీ ఆయా బ్యాటింగ్‌ పొజిషన్‌లోనే బరిలోకి దిగుతారు. అయితే సాహాను ఓపెనింగ్‌కు పంపించడం సరైందేనా అని అడిగితే.. అవుననే అంటాను. ఈ సిరీస్ మ్యాచ్‌లు ఆడుతుంది స్వదేశంలోనే కాబట్టి సాహా పరుగులు చేస్తాడు. ఐపీఎల్ టోర్నీలో కూడా అతడు ఓపెనింగ్‌ చేసిన విషయం మనకు తెలిసిందే. త్వరలోనే దక్షిణాఫ్రికాకు భారత్ వెళుతుంది కాబట్టి మన బ్యాటింగ్ లోటు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది' అని వసీమ్‌ జాఫర్‌ (Wasim Jaffer) చెప్పాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook