The Ghost: కాజల్‌, అమలా కాదు.. నాగార్జునకు జోడీగా నటించేదెవరో తెలుసా?

'ది ఘోస్ట్‌' సినిమా కోసం ఫైనల్‌గా యువ కథానాయిక  మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్లు సమాచారం తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 11:01 AM IST
  • ఫైనల్‌గా మెహ్రీన్ ఫిర్జాదా
  • నాగార్జునకు జోడీగా మెహ్రీన్
  • నాగార్జునకు జోడీగా నటించేదెవరో తెలుస
The Ghost: కాజల్‌, అమలా కాదు.. నాగార్జునకు జోడీగా నటించేదెవరో తెలుసా?

Amala Paul out and Mehreen Kaur in Nagarjuna's The Ghost Film: టాలీవుడ్ 'కింగ్' నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు బిగ్ బాస్‌ హోస్ట్‌గా చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తున్నారు. కథానాయకుడు బంగార్రాజు సినిమా చేస్తూనే.. 'ది ఘోస్ట్‌' (The Ghost) షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. యువ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందుతోన్న ది ఘోస్ట్‌.. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. నారాయణ్‌ దాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ మాజీ 'రా' అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమయిన ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

'ది ఘోస్ట్‌' సినిమా కోసం దర్శక నిర్మాతలు హీరోయిన్ వేటలో ఉన్నారు. నాగార్జునకు జోడీగా ముందుగా కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal)ను ఎంపిక చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల కాజల్‌ ఈ సినిమా నుంచి తప్పుకొంది. ఆపై అమలా పాల్‌ (Amala Paul) ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఫైనల్‌గా యువ కథానాయిక  మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా (Mehreen Kaur) ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో కథా చర్చలు పూర్తి చేసిందని, స్క్రిప్ట్‌ నచ్చడంతో కింగ్ సరసన నటించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.

Also Read: Tamil Nadu Earthquake Today: తమిళనాడులోని వేలూరులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రత నమోదు

 మెహ్రీన్ ఫిర్జాదా (Mehreen Kaur) హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో జరగాల్సిన వివాహంను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి కోసం కొన్ని సినిమాలు వదులుకున్న మెహ్రీన్.. మళ్లీ స్పీడ్ పెంచింది. వరుసగా సినిమాలను ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే  'ది ఘోస్ట్‌' సినిమా కథ నచ్చడంతో నాగ్ సరసన నటించేందుకు ఒప్పుకుందట. మెహ్రీన్ ప్రస్తుతం తెలుగులో 'ఎఫ్‌ 3', కన్నడంలో శివరాజ్‌ కుమార్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటున్న మెహ్రీన్..  'ది ఘోస్ట్‌' సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి. 

Also Read: ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలేంటి, ఏ వయస్సువారికి ప్రమాదకరం

మరోవైపు కింగ్ నాగార్జున (Nagarjuna) కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. బంగార్రాజు, ది ఘోస్ట్‌ సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉన్నారు. బంగార్రాజు సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కూడా నటిస్తున్నాడు. వీరిద్దరూ తాత, మనువడిగా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. నాగార్జునకు జతగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు. భారీ తారాగణం ఉన్న బంగార్రాజు సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News