Fastest T20I hundred: పొట్టి క్రికెట్‌లో మ‌రో సంచ‌ల‌నం నమోదైంది. న‌మీబియా ఆటగాడు జాన్ నికొల్ లొఫ్టీ ఈట‌న్ (Jan Nicol Loftie Eaton) టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ నమోదు చేశాడు. కేవలం 33 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లుతో శతకం కొట్టి ఔరా అనిపించాడు. మెుత్తం 36 బంతులాడిన నికొల్ 101 పరుగులు చేశాడు. రెండు నెలల కిందట నేపాల్ క్రికెటర్ కుశాల్ మ‌ల్లా(Kushal Malla) పొట్టి క్రికెట్ లో వేగవంతమైన సెంచరీ చేశాడు. ఆసియా గేమ్స్‌లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో 34 బంతుల్లోనే శతక్కొట్టాడు. తాజాగా జాన్ కుశాల్ కుశాల్ రికార్డును బద్దలుకొట్టేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11వ ఓవర్ లో క్రీజులోకి వచ్చిన నికోల్ పూనకం వచ్చినట్లు బాదాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపాడు. అతడి హిట్టింగ్ కు నేపాల్ బౌలర్లకు ఎక్కడ బంతి వేయాలో  తెలియలేదంటే అతడి దూకుడు ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. జాన్ మెరుపు సెంచరీ కారణంగా నమీబియా టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మలన్ క్రుగర్ (48 బంతుల్లో 59*) హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కి 135 పరుగుల థ్రిల్లింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. దీంతో నమీబియా జట్టు 20 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20ల్లో వేగవంతమైన బ్యాట్స్‌మెన్ జాబితాలో జాన్ నికొల్ లొఫ్టీ ఈట‌న్ అగ్రస్థానంలో ఉండగా.. మల్లా  రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తర్వాత స్థానాల్లో డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ, సుధేష్ విక్రమశేఖర ఉన్నారు. 



Also Read: Neil Wagner Retirement: అంతర్జాతీయ క్రికెట్ కు కివీస్ స్టార్ పేసర్ గుడ్ బై


Also Read: Team India: ఇంగ్లండ్ బజ్‌బాల్ గేమ్ కు బ్రేకులు వేసిన రోహిత్ సేన.. భారత్ ఖాతాలో 17వ సిరీస్ విజయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి