ఒలింపిక్ స్వర్ణంతో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో దూకుడు.. నీరజ్ చోప్రా ప్రస్తుత ర్యాంక్ ఎంతో తెలుసా?
Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన భారత్ స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ప్రపంచ ర్యాంకింగ్స్ లో 14 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి భారత వందేళ్ల నిరీక్షణకు తెరదించాడు భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా. ఇతడు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించాడు.
ఈ స్వర్ణ పతక ప్రదర్శనతో అతడి వరల్డ్ ర్యాంకింగ్ (World Ranking) కూడా మెరుగయ్యింది. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లక ముందు నీరజ్ చోప్రా(Neeraj Chopra) ర్యాంకు 16. ఇప్పుడు ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 2వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఒలింపిక్స్(Olympics) ఫైనల్‌లో 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా మొత్తం 1315 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
Also Read: Neeraj Chopra: నెట్టింట్లో వైరల్ అవుతున్న నీరజ్ చోప్రా వీడియో
జర్మన్ స్టార్ జావెలిన్ త్రోయర్ జోహానెస్ వెటర్(Johannes Wetter) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 1396 పాయింట్లు ఉన్నాయి. జర్మనీకి చెందిన వెటర్ ఈ ఏడాది ఏడు సార్లు 90 మీటర్లకు పైగా దూరం విసిరాడు. కానీ ఒలింపిక్స్ ఫైనల్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. వెటర్ కేవలం 82.52 మీటర్లు మాత్రమే విసిరి 9వ స్థానంలో నిలిచాడు. అయినా సరే అతడి టాప్ ర్యాంక్ లోనే కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే వరల్డ్ నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని నిపుణులు చెబుతున్నారు. ఒలింపిక్స్ తర్వాత నీరజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గతంలో 1.43 లక్షల ఇన్‌స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 34 లక్షలకు దాటిపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. మరోవైపు నీరజ్ చోప్రా శిక్షణ తీసుకున్న పంచకుల స్పోర్ట్స్ స్కూల్‌కు అడ్మిషన్ల తాకిడి పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook