Netizens trolls Rohit Sharma after kicking the ball: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో మ్యాచులో భారత్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచులో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (52: 41 బంతుల్లో 7×4, 1×6), రిషబ్‌ పంత్‌ (52: 28 బంతుల్లో 7×4, 1×6) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులకు పరిమితమైంది. నికోలస్‌ పూరన్‌ (62: 41 బంతుల్లో 5×4, 3×6), రావ్‌మన్‌ పావెల్‌ (68 నాటౌట్: 36 బంతుల్లో 4×4, 5×6) మెరుపులు మెరిపించారు. భారత బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేశానికి గురయ్యాడు. 187 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ బ్యాటర్లు నికోలస్‌ పూరన్‌, రావ్‌మన్‌ పావెల్‌ ధాటిగా ఆడారు. ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సులు బాదుతూ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ బౌలర్లను మార్చినా ఈ జోడీని విడదీయలేకపోయారు. దాంతో కరేబియన్ జట్టు విజయం దిశగా దూసుకెళ్లింది. టీమిండియా పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ 16వ ఓవర్‌లోని ఐదవ బంతిని షార్ట్‌ పిచ్‌ రూపంలో సాధించగా.. పావెల్‌ గాల్లోకి లేపాడు. భువీ క్యాచ్‌ పట్టేందుకు ప్రయత్నించగా.. బంతి చేజారింది.


కీలక క్యాచ్ భువనేశ్వర్‌ కుమార్‌ వదిలేయడంతో కెప్టెన్ రోహిత్‌ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. భువీ చేతుల్లోంచి కిందపడిన బంతిని రోహిత్ తన కాలితో తన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన టీమిండియా ఫాన్స్ భారత సారథిపై విమర్శలు చేస్తున్నారు. 'అంత ఎత్తుకు వెళ్లిన బంతిని పట్టడం కష్టమే అని ఒకరు ట్వీట్ చేయగా'.. 'కెప్టెన్‌గా ఉంటూ ఇలా చేయడం సరికాదు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'రోహిత్.. ఎంఎస్ ధోనీని చూసి నేర్చుకో', 'మ్యాచ్‌లో కొన్నిసార్లు ఇలాంటి తప్పులు జరుగుతాయి' అని నెటిజన్లు చురకలు అంటించారు. 



19వ ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ కుమార్‌ కేవలం 4 పరుగులిచ్చి డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఔట్‌ చేశాడు. దాంతో భారత్ రేసులోకి వచ్చింది. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో రావ్‌మన్‌ పావెల్‌ రెండు సిక్సులు బాదినా.. విండీస్ ఓడిపోక తప్పలేదు. చివరకు భారత్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. భువీ వేసిన 19వ ఓవరే మ్యాచ్ టర్కింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.  


Also Read: Bheemla nayak event: భీమ్లా నాయక్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​​ 21న ఫిక్స్​- ముఖ్య అతిథిగా కేటీఆర్​


Also Read: UGC NET Result declared: యూజీసీ నెట్ 2021 పరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook