UGC NET Result declared: యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల ఫలితాల్ని చెక్ చేసుకోవచ్చు ఇలా. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ 2021 పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in, ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ nta.ac.in లో పరీక్ష ఫలితాల్ని చెక్ చేసుకోవచ్చు. 2021 నవంబర్ 20, 21, 22, 24, 25, 26, 29, 30 తేదీలతో పాటు డిసెంబర్ 1, 3,4, 5 తేదీల్లోనూ, జనవరి 2022లో 4, 5 తేదీల్లోనూ యూజీసీ నెట్ పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా 239 నగరాల్లో 837 కేంద్రాల్లో 81 అంశాలపై ఈ పరీక్షలు జరిగాయి. దాదాపు 12 లక్షలమంది విద్యార్ధినీ విద్యార్ధులు పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు.
ఎలా చెక్ చేసుకోవాలి
ముందు యూజీసీ నెట్ అధికారి వెబ్‌సైట్ ugcnet.nta.nic.in.ఓపెన్ చేయాలి. లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే మీ స్క్రీన్‌పై కన్పిస్తాయి. రిజల్ట్ చెక్ చేసుకుని ఆ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి. ఒక హార్డ్ కాపీ కూడా తీసి ఉంచుకోండి. యూజీసీ నెట్ పరీక్ష ఫలితాలు కేవలం 90 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పరీక్ష ఫలితాలకు సంబంధించి రీ వాల్యుయేషన్ లేదా రీ చెక్ ఉండదని యూజీసీ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ విధమైన సంప్రదింపులు కూడా ఉండవు.
యూజీసీ నెట్ 2021 పరీక్షలో జనరల్ కేటగరీ విద్యార్ధులకు పాస్ మార్కులు 40 శాతం కాగా, రిజర్వేషన్ కేటగరీకు 35 శాతం ఉంటే సరిపోతుంది. ప్రతి పేపర్ పాసై ఉండాల్సిందే.
Also read: SBI Recruitment 2022: డిగ్రీ విద్యార్హతతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook