భారత్‌‌తో జరుగుతున్న రెండో ట్వంటీ20లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. అయితే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుకున్నదే జరిగింది. ఛేజింగ్‌ చేయడంలో భారత్‌కు తిరుగులేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలియమ్సన్ నిర్ణయం భారత్‌కు కలిసొస్తుందని, ఒకవేళ తాను టాస్ నెగ్గినా కివీస్‌నే బ్యాటింగ్‌కు ఆహ్వానించేవాడినని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఐదు టీ20ల ఈ సిరీస్‌లో  భారత్ 1-0తో ఆధిక్యంలో ఉండగా.. రెండో టీ20 నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ భావిస్తోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఏ మార్పు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. కాగా, తొలి టీ20లో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ అవలీలగా ఛేదించినా.. రెండో టీ20లో కివీస్ బ్యాటింగ్ ఎంచుకోవడం గమనార్హం. ఆక్లాండ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే స్ట్రోక్ ప్లేకు అవకావం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు విలియమ్సన్ తెలిపాడు.


భారత జట్టు:
R Sharma, KL Rahul, V Kohli, S Iyer, S Dube, M Pandey, R Jadeja, S Thakur, Y Chahal, M Shami, J Bumrah


న్యూజిలాండ్ జట్టు: 
M Guptill, C Munro, K Williamson, C de Grandhomme, R Taylor, T Seifert, M Santner, T Southee, I Sodhi, B Tickner, H Bennett


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..