New Zealand Team For India Series: భారత్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. కివీస్ పర్యటనలో ఈ నెల 18 నుంచి 30 వరకు భారత్ మూడు టీ20, వన్డే సిరీస్‌లు ఆడబోతుంది. భారత్‌తో  ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టులో కీలక మార్పులు చేసింది. టీమిండియాపై మంచి రికార్డు ఉన్న ఇద్దరు కీలక ఆటగాళ్లను సెలెక్టర్లు పక్కన బెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమింయా టీ20, వన్డే సిరీస్‌లకు కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను ఈ సిరీస్‌ నుంచి తప్పించారు. అతనితో పాటు కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ కూడా వన్డే, టీ20 జట్టు నుంచి నిష్క్రమించాడు. ట్రెంట్ బౌల్ట్‌ను న్యూజిలాండ్ క్రికెట్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ నుంచి తప్పుకోవడంతో అతనిడి ఎంపిక చేయలేదు. పేలవ ఫామ్ కారణంగా మార్టిన్ గప్టిల్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల ఆడిన టీ20 ప్రపంచకప్‌లో గప్టిల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. మార్టిన్ గప్టిల్ స్థానంలో ఫిన్ అలెన్ ఇప్పుడు న్యూజిలాండ్ వన్డే, టీ20 జట్టులో ఓపెనర్‌గా ఎంపికయ్యాడు.


బౌల్ట్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే భారత్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టులోకి తిరిగి వచ్చాడు. కైల్ జేమీసన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. టీమిండియాలో చాలా మంది ప్రపంచస్థాయి క్రికెటర్లు ఉన్నారని అన్నాడు. తన టీమ్‌తో పోరు రసవత్తరంగా జరగనుందన్నాడు. భారత్ ఎప్పుడు కివీస్‌ పర్యటనకు వచ్చినా.. తుఫానులు వస్తుంటాయని సరదాగా అన్నాడు.


భారత్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు:


కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), ల్యూక్ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.


న్యూజిలాండ్ వన్డే జట్టు:


కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, ల్యూక్ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌతీ, మాట్ హెన్రీ.


Also Read: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. టీమిండియా కోచ్, డైరెక్టర్‌గా కొత్త బాధ్యత!


Also Read: Krishna Passed Away: ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ షేక్.. వరుసగా 12 సినిమాలు ఫ్లాప్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook