IND vs NZ: కివీస్‌తో టీ20 సిరీస్ నుంచి రోహిత్ శర్మ, కోహ్లీ ఔట్.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం..!
New Zealand Tour Of India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టులో మళ్లీ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బీసీసీఐ పక్కన బెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి సమాచారాన్ని లీక్ చేశారు.
New Zealand Tour Of India: ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత రెండు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. శ్రీలంక తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. కివీస్ టూర్ ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే కివీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టులో మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
జనవరి 27 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బీసీసీఐ దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. 2024 టీ20 ప్రపంచకప్ సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయట్లేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. వారిద్దరిని జట్టును తొలగించడానికో.. మరేదో కారణం కాదని.. భవిష్యత్ కోసం మంచి జట్టును నిర్మించాలని తాము భావిస్తున్నామన్నారు. మిగతా సెలక్టర్లు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారు. భువనేశ్వర్ కుమార్, ఆర్.అశ్విన్, మహ్మద్ షమీలను కూడా ఈ సిరీస్ నుంచి తప్పించే అవకాశం ఉందని చెప్పారు.
వన్డే సిరీస్‌లో చూడొచ్చు
ఈ నెల 10వ తేదీ నుంచి శ్రీలంకతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ వన్డే సిరీస్‌కు టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు. అదే సమయంలో జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వన్డే సిరీస్‌లో ఆడినా.. టీ20లో ఆడటం కష్టమేనని మాజీలు చెబుతున్నారు.
న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా
18 జనవరి మొదటి వన్డే హైదరాబాద్
21 జనవరి 2వ వన్డే రాయ్‌పూర్
24 జనవరి 3వ వన్డే ఇండోర్
27 జనవరి మొదటి టీ20 రాంచీ
29 జనవరి రెండో టీ20 లక్నో
1 ఫిబ్రవరి మూడో టీ20 అహ్మదాబాద్
Also Read: IND Vs Sri Lanka: ఆ ఒక్క షాట్ ఆడకపోయింటే భారత్‌దే గెలుపు.. అక్షర్, సూర్యకుమార్ పోరాటం వృథా
Also Read: CM Jagan: డీఎస్సీ 98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగ్ ఇవ్వండి.. సీఎం జగన్ ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook