Devon Conway Tests Positive for Covid 19: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్‌ జట్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. రెండో టెస్ట్‌ అనంతరం జరిపిన పరీక్షల్లోకివీస్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌కు‌ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. నేడు (జూన్‌ 16) వచ్చిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో స్టార్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వేకు వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అయిదు రోజుల పాటు కాన్వే ఐసోలేషన్లో ఉండనున్నాడు. కాన్వేకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో..  న్యూజిలాండ్‌ బృందంలో కేసుల సంఖ్య ఐదుకు చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'బుధవారం సాయంత్రం లండన్ చేరుకున్న తర్వాత ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లో డెవాన్‌ కాన్వేకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అతనితో పాటు ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్, సహాయక సిబ్బంది విజయ్ వల్లభ్ (ఫిజియో), క్రిస్ డోనాల్డ్‌సన్ కూడా కరోనా బారిన పడ్డారు. అందరూ ఐసోలేషన్లోకి వెళ్లారు' అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. చివరి టెస్ట్‌ వరకు వీరు అందుబాటులోకి వస్తారని న్యూజిలాండ్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది. 


డెవాన్‌ కాన్వేకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. న్యూజిలాండ్‌ జట్టు సభ్యులందరికీ మరోసారి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు కివీస్ వైద్య బృందం నమూనాలు సేకరించింది. ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. రెండో టెస్ట్‌ ప్రారంభానికి కొద్ది గంటల ముందు కెప్టెన్‌ కేన్ విలియమ్సన్, ఆ తర్వాత సపోర్టింగ్‌ స్టాఫ్‌లో ఇద్దరు సభ్యులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆపై మైకేల్‌ బ్రేస్‌వెల్‌, డెవాన్‌ కాన్వేకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు కొలిన్ గ్రాండ్‌హోమ్, కైల్ జేమీసన్ గాయాలపాలయ్యారు. 



 


ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌ జూన్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌కు న్యూజిలాండ్‌ పూర్తి జట్టుతో బరిలోకి దిగేది అనుమానంగా మారింది. ఇప్పటికే వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఓడి 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకున్న కివీస్ ఈ మ్యాచ్ గెలవడం కష్టంగానే ఉంది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో కివీస్ జట్టుకు టామ్ లాథమ్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. 


Also Read: Sammathame Trailer: లారీలైనా గుద్దితే తిరిగి చూస్తాయేమో గానీ.. ఈ అమ్మాయిలు తిరిగిచూసేలా లేరు!  


Also Read: Viral Video: నదిలో 40 మొసళ్లు చుట్టుముట్టినా.. మృత్యువు నుంచి తప్పించుకున్న సింహం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook