60 పరుగులకే 6 వికెట్లు తీసి లంక నడ్డి విరిచిన కివీస్
15.2 ఓవర్లలో 60 పరుగులకే 6 వికెట్లు తీసి లంక నడ్డి విరిచిన కివీస్ బౌలర్లు ఒకానొక దశలో లంక బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం కన్నా ఎక్కువగా వికెట్లు కాపాడుకునేందుకే తిప్పలు పడేలా చేశారు.
కార్డిఫ్: ప్రపంచ కప్‌లో భాగంగా కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ స్టేడియం వేదికగా నేడు జరుగుతున్న న్యూజిలాండ్ vs శ్రీలంక మ్యాచ్‌లో న్యూజీలాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 15.2 ఓవర్లలో 60 పరుగులకే 6 వికెట్లు తీసి లంక నడ్డి విరిచిన కివీస్ బౌలర్లు ఒకానొక దశలో లంక బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం కన్నా ఎక్కువగా వికెట్లు కాపాడుకునేందుకే తిప్పలు పడేలా చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా వరుస విరామాల్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్ చేర్చడంలో కివీస్ బౌలర్లు విజయం సాధించారు.
కివీస్ బౌలర్ల దూకుడు చూస్తే, లంక బ్యాట్స్ మెన్ ఏ మాత్రం గొప్ప స్కోర్ చేయకుండానే అతి తక్కువ ఓవర్లలోనే ఆలౌట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మేన్ చేతులెత్తేయడంతో జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత మిడిల్ ఆర్డర్, టెయిల్ ఎండర్స్‌పై పడింది. అయితే, టాప్ ఆర్డర్ ఆటగాళ్లు చేయలేని పనిని మిగితా ఆటగాళ్లు చేస్తారా అంటే సందేహమే మరి!