IPL 2020: పూరన్ ఫీల్డింగ్ అత్యద్భుతం.. సచిన్, సెహ్వాగ్ ప్రశంసలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్‌పై భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం షార్జాలో కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ (RR vs KXIP) మధ్య మ్యాచ్ ఉత్కంఠతో జరిగిన విషయం తెలిసిందే.
Sachin, Sehwag applause to Pooran: న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) పై భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ప్రశంసల వర్షం కురిపించారు. IPL 2020లో భాగంగా ఆదివారం షార్జాలో కింగ్స్ లెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ (RR vs KXIP) మధ్య మ్యాచ్ ఉత్కంఠతో జరిగిన విషయం తెలిసిందే. పరుగుల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) తన అద్భుతమైన ఫిల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
బౌండరీ లైన్‌పై పూరన్ గాలిలో తేలుతూ బంతిని అందుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంజూ శాంసన్ కొట్టిన భారీ షాట్ దాదాపు సిక్సర్‌గా వెళ్లిపోయిందనుకున్న క్రమంలో.. బౌండరీ దగ్గర ఉన్న నికోలస్ పూరన్ .. రోప్ దగ్గర గాలిలో డైవ్ చేస్తూ ఆ బంతిని అందుకోని.. కాలును నేలమీద పెట్టకముందే.. ఆ బంతిని మళ్లీ మైదానంలోకి విసిరి వేశాడు. అయితే పూరన్ కళ్లు చెదిరే ఫిల్డింగ్‌పై మాజీ క్రికెటర్లంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం పూరన్ ఫీల్డ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. Also read: MI VS RCB match news updates: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎవరి బలం ఎంత ?
ఈ మేరకు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ పూరన్‌పై ప్రశంసలు కురింపించారు. నా జీవితంలో చూసిన అత్యద్భుతమైన ఫీల్డింగ్ ఇదేనంటూ సచిన్ ట్విట్ చేయగా.. మామూలుగా లేదంటూ సెహ్వాగ్ అభినందిస్తూ ట్విట్ చేశారు. ఇదిలాఉంటే..పూరన్ ఫీల్డింగ్ అద్భుతమంటూ హర్షాబోగ్లే కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతం పూరన్ ఫీల్డింగ్ విన్యాసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Also read : Sanju Samson: సిక్సర్ల సీక్రెట్ వెల్లడించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్