ఐపిఎల్ 2020లో భాగంగా నేడు సోమవారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న 10వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) కెప్టేన్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రోహిత్ శర్మ ( Rohit Sharma ) కెప్టేన్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ జట్లు ( RCB vs MI match ) తలపడనున్నాయి. ఐపిఎల్ 13వ సీజన్‌ని ఆరంభించిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడిన ముంబై ఇండియన్స్ జట్టు.. ఆ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ధోనీ సేన చేతిలో ఓటమిపాలైంది. Also read : Sanju Samson: సిక్సర్ల సీక్రెట్ వెల్లడించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్
ఈ సీజన్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును ఢీకొట్టిన Mumbai Indians.. ఈసారి కసిగా ఆడి 49 పరుగుల తేడాతో కోల్ కతాపై ఘన విజయం సాధించింది. నేడు జరగనున్న మ్యాచ్‌లో Royal Challengers Bangalore పై గెలిచి రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.
ఇక రాయల్స్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు విషయానికొస్తే.. ఈ సీజన్‌లో జరిగిన 3వ మ్యాచ్‌లో SunRisers Hyderabad పై 10 పరుగుల తేడాతో గెలిచిన ఈ జట్టు, ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో ఘోర పరాజయంపాలైంది. పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా 97 పరుగుల తేడాతో KL Rahul కెప్టేన్‌గా వ్యవహరిస్తున్న Kings XI Punjab జట్టు చేతిలో ఓటమి చవిచూసింది.
ఐపిఎల్ 2020 సీజన్‌లో నేడు మూడోసారి మ్యాచ్ ఆడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఈసారి ఎలాగైనా తమ కసి చూపించాల్సిందేనని గట్టిగానే ప్రయత్నిస్తోంది. Also read : Gautam Gambhir Vs Shashi Tharoor: ధోనీ తర్వాత సంజూ శాంసనా?.. గౌతమ్ గంభీర్ ఫైర్
RCB vs MI head to head matches: రెండు జట్లు తలపడిన సందర్భాల్లో ఎవరు ఎక్కువ గెలిచారు ?:
ఐపిఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 27 మ్యాచుల్లో పోటీపడగా.. అందులో ముంబై ఇండియన్స్ కే అత్యధిక మ్యాచులు గెలిచిన రికార్డ్ సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్ 18 మ్యాచులు గెలవగా, ఆర్సీబీ జట్టు 9 మ్యాచుల్లో విజయం సాధించింది.
ఈ రెండు జట్లు ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ 4 మ్యాచుల్లో విజయం సాధించగా.. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఒక్కసారి విజయం సొంతం చేసుకుంది.
నేడు బరిలోకి దిగే ఆటగాళ్లు వీళ్లేనా ?
RCB Team probable playing XI players: దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబి డివిలియర్స్, పార్థివ్ పటేల్ ( వికెట్ కీపర్ ), శివం దూబే, మొయీన్ అలీ, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, డేల్ స్టేయిన్, ఉమేష్ యాదవ్. Also read : IPL చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డ్.. మళ్లీ రాజస్థానే
Mumbai Indians Team probable playing XI: రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, సౌరబ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కైరాన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ ప్యాటిన్సన్, జస్‌ప్రీత్ బుమ్రా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
MI VS RCB match news: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎవరి బలం ఎంత ?