శ్రీలంకలో ఐపీఎల్ మెగా టోర్నీ.. స్పందించిన బీసీసీఐ
ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు ఏ అభ్యంతరం లేదంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు (IPL to be held in Sri Lanka) ప్రకటన ఇవ్వడం ఆశలు రేపుతోంది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 2020కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15వాయిదా పడింది. లాక్‌డౌన్ పొడిగిచిన తర్వాత టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో కొత్త వాదన తెరమీదకి వచ్చింది. కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా ?
ఐపీఎల్ తాజా సీజన్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు ఏ అభ్యంతరం లేదంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన ఇవ్వడం ఆశలు రేపుతోంది. భారత్‌లో ట్వంటీ20 సమరం నిర్వహించకపోయినా లంకలో జరిగిన క్రికెట్ వేడుకను చూడవచ్చునని.. అసలే లాక్‌డౌన్‌లో ఉన్న తమకు ఇది కలిసొచ్చే అంశమని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. ఆమె అందాలకు నెటిజన్లు LockDown
శ్రీలంకలో ఐపీఎల్ నిర్వహణ కథనాలపై బీసీసీఐ స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో పోరాడుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యమని బోర్డుకు చెందిన ఓ సభ్యుడు పేర్కొన్నాడు. శ్రీలంకలో ఐపీఎల్ నిర్వహించాలా వద్దా అనే అంశంపై తాము అసలు ఆలోచించలేదన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ గురించే తాము ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. లంకలో కేవలం మూడు స్టేడియాలు మాత్రమే ఉంటాయని, వనరుల కొరత ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ ఐపీఎల్ నిర్వహణ అంటూ కొత్త ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్‌లో పెళ్లి!
కాగా, శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మి శివ గురువారం మాట్లాడుతూ.. ఐపీఎల్‌ను నిర్వహించేందుకు తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధమేనని వ్యాఖ్యానించారు. భారత్‌తో పోల్చితే కరోనా అరికట్టిన తర్వాత లంకలో పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి వస్తాయన్నారు. ఇక అది మొదలుకుని లంకలో ఐపీఎల్ అంటూ క్రికెట్ ప్రేమికులు ట్వంటీ20 మెగా టోర్నీపై ఆశలు పెంచుకుంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos