వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో జకోవిచ్ సత్తా చాటాడు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో  దక్షిణాఫ్రికా ఆటగాడు అండర్సన్‌పై 6-2, 6-2, 7-6 స్కోరుతో అనూహ్యమైన విజయాన్ని నమోదు చేశాడు. సెర్బియాకి చెందిన జకోవిచ్ తొలి రెండు సెట్లలోనూ చాలా చక్కగా ఆడి.. ప్రత్యర్థికి సవాళ్లు విసరగా.. మూడో సెట్‌లో మాత్రం ఆండర్సన్ రెచ్చిపోయాడు. ఎంతో కష్టపడి దూకుడు మీద ఉన్న జకోవిచ్‌ను కట్టడి చేస్తూ.. ఎలాగోలా సెట్‌ను 6-6తో సమం చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మ్యాచ్ టై బ్రేక్ అవ్వడంతో పరిస్థితి కాస్త అయోమయంగా మారింది. ఇప్పుడు కచ్చితంగా టై బ్రేక్ గెలవాల్సిన అవసరం అండర్సన్‌కి ఏర్పాడింది. కానీ ఆ తర్వాత మాత్రం అండర్సన్ వరుస తప్పిదాలు చేయడంతో.. జకోవిచ్ 7-3తో ఆధిక్యతను కనబరుస్తూ ప్రత్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాడు. ఆఖరికి మూడో సెట్‌లో 7-6 స్కోరుతో వింబుల్డన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. 


గత నెల ఫ్రెంచి ఓపెన్‌లో జకోవిచ్ స్పెయిన్‌కు చెందిన ఫెర్నాండో వర్దాస్కోపై 6-3, 6-4, 6-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లి.. తన కెరీర్‌లో 200వ విజయాన్ని నమోదు చేశాడు. తాజా వింబుల్డన్ జకోవిచ్‌కు దక్కిన నాల్గవ వింబుల్డన్ టైటిల్.