NZ vs Australia 2nd T20: Martin Guptill smashes Rohit Sharmas Highest Sixes record: మార్టిన్ గప్టిల్ వీర విహారం, Rohit Sharma సిక్సర్ల రికార్డు బద్ధలు
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు బద్ధలైంది. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో గురువారం జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భాగంగా గప్టిల్ ఈ ఘనత సాధించాడు. మార్టిన్ గప్టిల్ 132 సిక్సర్లతో నెంబర్ వన్‌గా అవతరించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట 127 సిక్సర్లతో రికార్డు ఉండగా.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో 8 సిక్సర్లు బాదిన న్యూజిలాండ్(New Zealand) ఓపెనర్ గప్టిల్ టీ20 సిక్సర్లు 132కు చేరుకున్నాడు. గప్టిల్ (97 ; 50 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లు), కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(53), ఆల్ రౌండర్ జేమీ నీషమ్(16 బంతుల్లో 45) రాణించడంతో 20 ఓవర్లకు కివీస్ 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.


Also Read: Ind vs Eng 3rd Test Live Score Updates: అతిపెద్ద స్టేడియంలో మూడో టెస్టు, ఎలా వీక్షించాలి, పూర్తి వివరాలు


టీ20ల్లో అత్యధిక సిక్సర్ల వీరులు..
మార్టిన్ గప్టిల్ 96 టీ20 మ్యాచ్‌లలో 132 సిక్సర్లు బాదాడు. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ(Rohit Sharma) 108 మ్యాచ్‌లలో 127 సిక్సర్లు సాధించాడు. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 97 మ్యాచ్‌లలో 113 సిక్సర్లు, కొలిన్ మున్నో 107 సిక్సర్లు, క్రిస్ గేల్ 105 సిక్సర్లు టాప్ 5లో ఉన్నారు.


Also Read: DA Hike Latest News: త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు


27 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన గప్టిల్ అనంతరం దాటిగానే ఇన్నింగ్స్ కొనసాగించాడు. అయితే శతకానికి మరో 3 పరుగుల దూరంలో మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు. ప్రతిసారిలాగే బ్యాటింగ్ చేశాను, సాధ్యమైనన్ని పరుగులు చేసేందుకు ప్రయత్నించా, అయితే శతకం చేయనందుకు కాస్త నిరాశగా ఉందని స్పార్క్ స్పోర్ట్‌ మీడియాతో ముచ్చటిస్తూ పేర్కొన్నాడు.


Also Read: Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ FREE Cricket సెషన్స్, యువ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook