IPL 2021 CSK Captain MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధికంగా ఆర్జించిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలిచాడు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో రూ.150 కోట్లు ఆర్జించిన తొలి ఆటగాడిగా ధోనీ నిలిచాడు. ఐపీఎల్ 2020 వరకు ధోనీ రూ.137.8 కోట్లు ఆర్జించాడు.
ఇన్‌సైడ్ స్పోర్ట్ మనీబాల్ రిపోర్టు ప్రకారం ఐపీఎల్ 2021(IPL 2021 Latest Updates)లో రూ.15 కోట్లు అందుకోనున్నాడు. వీటితో కలిపితే ధోనీ ఐపీఎల్ సంపాదన రూ.150 కోట్లు దాటనుంది. ధోనీ మొత్తంగా ఐపీఎల్ 2021 సీజన్‌తో కలిపి రూ.152.8 కోట్లు ఆర్జిస్తున్నాడు. ధోనీ తర్వాత స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా ఆర్జించిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ.
రోహిత్ శర్మ(Rohit Sharma In IPL) ఐపీఎల్ 2020 వరకూ రూ.131.6 కోట్లు సంపాదించాడు. తాజా సీజన్ ఐపీఎల్ 2021లో రూ.15 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నాడు. దీంతో రోహిత్ మొత్తం సంపాదన రూ.146.6 కానుంది. రోహిత్ తరువాత స్థానంలో టీమిండయా రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ రూ.126.2 కోట్లు ఆర్జించాడు. ఐపీఎల్ 2021లో కోహ్లీ రూ.17 కోట్లు అందుకోనున్నాడు. దీంతో కోహ్లీ మొత్తం సంపాదన రూ.143.2 కోట్లకు చేరుతుంది.
ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు సురేష్ రైనా. భారత మాజీ క్రికెటర్ రైనా ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 99.7 కోట్ల రూపాయాలు సంపాదించాడు. ఈ సీజన్ వేతనంతో కలిపితే రూ.100 కోట్ల మార్కును రైనా అధిగమించనున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook