ODI World Cup 2023 Prize Money: భారత్ వేదికగా అక్టోబరు 05న వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ స్క్వాడ్స్ ను ప్ర‌క‌టించాయి. తాజాగా ఐసీసీ కూడా విజేతలకు ఇచ్చే ప్రైజ్ మ‌నీ(Prize Money)ని ప్ర‌క‌టించింది. ఈ మెగా ఈవెంట్ కోసం కోటి డాల‌ర్ల‌ను (సుమారు రూ.82 కోట్లు) కేటాయించిన‌ట్టు అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి(ICC) పేర్కొంది. విజేత‌కు 40 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే రూ. 33 కోట్లు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్టుకు 20 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే రూ. 16.5 కోట్లు ఇవ్వనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెమీస్ లో ఓడిన రెండు జట్లుకు చెరో రూ. 13 కోట్లు అందజేయనున్నారు. సూప‌ర్ 6 ద‌శ‌లోనే ఇంటిముఖం పట్టిన టీమ్స్ కు రూ.4.9 కోట్లు ఇవ్వనున్నారు. అంతేకాదు గ్రూప్ ద‌శ‌లో గెలిచిన జ‌ట్ల‌కు కూడా ప్రైజ్ మ‌నీ ఎనౌన్స్ చేశారు. గ్రూప్ స్టేజ్‌లో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు 40 వేల డాలర్లు అంటే రూ.33 ల‌క్ష‌లు ఇవ్వనున్నట్లు ఐసీసీ పేర్కొంది. 2019లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జ‌ట్టుకు రూ. 39 కోట్లు ప్రైజ్‌మ‌నీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత వరల్డ్ కప్ తో పోలిస్తే ఈ సారి ఛాంపియన్ గా నిలిచిన టీమ్ కు ప్రైజ్‌మ‌నీ తగ్గిందనే చెప్పాలి. 


Also Read: Asian Games 2023: వర్షం కారణంగా మలేషియాతో మ్యాచ్ రద్దు.. సెమీస్‌లోకి టీమిండియా..


2025లో జరగబోయే మహిళల వరల్డ్ కప్ ప్రైజ్ మనీని కూడా ఐసీసీ ప్రకటించింది. ఇక నుంచి పురుషుల, మహిళల టోర్నీలకు ఒకే ప్రైజ్ మనీ ఇవ్వాలని ఈ మధ్యే ఐసీసీ నిర్ణయించింది. అంటే ఆ వరల్డ్ కప్ లోనూ ఇదే ప్రైజ్ మనీ వర్తించనుందన్న మాట. 


వరల్డ్ కప్ లో పాల్గొనబోయే జట్లు- ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్. 


ప్రపంచ కప్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్.


Also Read: Team India New Jersey: వన్డే వరల్డ్ కప్.. టీమిండియా కొత్త జెర్సీ విడుదల..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook