IND vs NED: మళ్లీ అడ్డుపడిన వరుణుడు.. భారత్, నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్ రద్దు..
Cricket World Cup 2023: భారత్, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కు వరుణుడు గండి కొట్టాడు. ఎంతకీ వాన ఆగకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు అంపైర్లు.
India Vs Netherlands warm-up match: వన్డే వరల్డ్ కప్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. భారత్ వేదికగా అక్టోబరు 05 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే అంతకముందు జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌లు వర్షార్పణం అవుతున్నాయి. ఇవాళ తిరువనంతపురం వేదికగా భారత్, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వాన కారణంగా రద్దయింది. టాస్ కూడా పడకుండానే మ్యాచ్ క్యాన్సిల్ అయింది. సెప్టెంబర్ 30న గువహటి వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ కూడా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో వార్మప్ మ్యాచ్లు ఆడకుండానే టీమిండియా నేరుగా వన్డే ప్రపంచకప్‍లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మరో రెండు రోజుల్లో వన్డే వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. ఈ మెగా టోర్నీ నవంబరు 19 వరకు జరగనుంది. చెన్నై వేదికగా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‍తో వరల్డ్ కప్ వేటను మెుదలుపెట్టనుంది టీమిండియా. ప్రపంచకప్ కు ముందు అస్త్రశస్త్రాలను సరిచూసుకుందాం అనుకున్న భారత్ కు వరుణుడు దెబ్బకు కొట్టాడు. ఈసారి టీమిండియా నంబర్ వన్ హోదాలో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచి మాంచి ఊపు మీద కూడా ఉంది. ఈసారి భారత్ జట్టును ఎదుర్కోవడం మిగతా టీమ్స్ కు పెద్ద సవాల్ అనే చెప్పాలి.
వరల్డ్ కప్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్.
Also Read: World Cup 2023: ప్రపంచకప్ 2023 ఆడనున్న ప్రపంచంలోని టాప్ 5 ధనవంతులు వీళ్లే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook