World Cup 2023: ప్రపంచకప్ 2023 ఆడనున్న ప్రపంచంలోని టాప్ 5 ధనవంతులు వీళ్లే

World Cup 2023: వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమై నవంబర్ 19 వరకూ జరగనుంది. ఇండియా ఆతిధ్యం ఇవ్వనున్న ఈ ప్రపంచకప్ 45 రోజులు నడవనుంది. ఈ ఈవెంట్‌లో 10 జట్లు 48 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
 

World Cup 2023: దేశంలోని వేర్వేరు నగరాల్లో ఈ 48 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ ప్రపంచకప్‌లో ఆడుతున్న ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ధనవంతులెవరో తెలుసా..ఈ ఐదుగురిలో ఇద్దరు భారతీయులే కావడం విశేషం
 

1 /5

విరాట్ కోహ్లి ప్రపంచకప్ 2023లో ఆడుతున్న అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఇండియాకు చెందిన విరాట్ కోహ్లి. కోహ్లీ సంపద 950 కోట్లకు పైగా ఉంది.

2 /5

స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఇతడి మొత్తం సంపాదన 200 కోట్లుగా ఉంది. 

3 /5

రోహిత్ శర్మ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. ఇతడి సంపద మొత్తం 210 కోట్లు ఉంటుంది. 

4 /5

ప్యాట్ కమ్మిన్స్ ఈ జాబితాలో మరో ధనవంతుడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. ప్యాట్ కమ్మిన్స్ సంపద 350 కోట్లు ఉంటుంది. 

5 /5

మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఇతడి సంపద 150 కోట్లు ఉంటుంది.