Neeraj Chopra: మళ్లీ గోల్డెన్ త్రో విసిరిన నీరజ్ చోప్రా... దోహా డైమండ్ లీగ్ కైవసం..
Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి స్వర్ణంతో మెరిశాడు. తాజాగా దోహా డైమండ్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు.
Neeraj Chopra Gold Medal: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సంవత్సరాన్ని అద్భుతమైన విజయంతో ప్రారంభించాడు. అంతర్జాతీయ వేదికపై మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఒలింపిక్ ఛాంపియన్ తాజాగా దోహా డైమండ్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాడు. తన బల్లెంను 88.67 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. తాజా విజయంతో వచ్చే ఏడాది పారిస్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ లో నీరజ్ ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ మరియు టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకుబ్ వాల్డెజ్ సహా పలువురిని ఓడించి ట్రోఫీని గెలుచుకున్నాడు.
దోహా మీట్‌కు ముందు నీరజ్ 90 మీటర్ల మార్కును అధిగమించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అది నెరవేరలేదు. తాజాగా జరిగిన ఫైనల్ లో రెండు, మూడు త్రోలలో 86.04 మీటర్లు, 85.47 మీటర్లు దూరం బల్లెంను విసిరాడు నీరజ్. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. 5, 6 ప్రయత్నాల్లో 84.37మీ, 86.52 మీటర్లు ఈటెను విసిరి గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో జాకుబ్ వాల్డెజ్ రెండో స్థానంలోనూ, పీటర్స్ మూడో స్థానంలోనూ నిలిచారు. ఇదే మీట్ లో పురుషులు ట్రిపుల్ జంప్ లో భారత అథ్లెట్ ఎల్డోస్ పాల్ నిరాశపరిచాడు. 15.84 మీటర్లను దూరం దూకి పదో స్థానంలో నిలిచాడు. ఈ ట్రిపుల్ జంప్ లో పోర్చుగల్ కు చెందిన పెడ్రో పిచార్డ్ గోల్డ్ మెడల్, బుర్కినాఫోసోకు చెందిన జాంగో సిల్వర్ మెడల్ సాధించాడు.
Also Read: Virat Kohli-Anushka Sharma: నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.