Virat Kohli: ఆర్సీబీ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ వార్నింగ్
అన్ లక్కీ టీమ్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు పేరు. ఒక్క చిన్న తప్పిదం టోర్నమెంట్‌లో టీమ్ దశనే మార్చేస్తుందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్సీబీ సహచరులకు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli To RCB Teammates) సూచించాడు.
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అన్ లక్కీ టీమ్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు పేరు. మూడు సీజన్లు ఫైనల్ చేరినా.. చివరి మెట్టుపై తడబాటుకు గురై రన్నరప్‌లతో సరిపెట్టుకుంది ఆర్సీబీ. ఐపీఎల్ 2020 (IPL 2020)లో తాము చేసే ఒక్క చిన్న తప్పిదం టోర్నమెంట్‌లో టీమ్ తలరాతనే మార్చేస్తుందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్సీబీ సహచరులకు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సూచించాడు. ఓ రకంగా చెప్పాలంటే ఆట పరంగా, ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలని జట్టు సభ్యులను కోహ్లీ హెచ్చరించాడు. IPL 2020: అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ జోడీ ఎవరంటే...
ఆర్సీబీ టీమ్ సోమవారం ఆన్‌లైన్ మీటింగ్‌లో పాల్గొంది. బయో బబుల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ విషయంలోనూ రాజీ పడకూడదని కోహ్లీ పేర్కొన్నాడు. ఒక్కరు చేసే తప్పిదం కారణంగా మొత్తం ఆర్సీబీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, బీ కేర్‌ఫుల్ అంటూ హెచ్చరించాడు. ప్రొటోకాల్స్ తప్పనిసరి పాటించాలని, తద్వారా టోర్నీని విజయవంతంగా ముగించవచ్చునని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్
దుబాయ్ చాలా సురక్షితమైన ప్రాంతమని, ఆటగాళ్లు క్వారంటైన్‌లో జాగ్రత్తలు పాటించాలని.. ప్రతి ఒక్కరికి సమాన బాధ్యతలు ఉన్నాయని గుర్తుచేశాడు. ఈ ఏడాది దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా యూఏఈ ఐపీఎల్ 2020కు ఆతిథ్యమిస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీని భారత్‌లో నిర్వహించడం లేదని తెలిసిందే. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి
తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి
Sanitizer: పదే పదే శానిటైజర్ వాడొద్దు.. ఎందుకో తెలుసా?