World Cup 2023: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మారింది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే
World Cup 2023: మరి కొద్దిరోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. కొన్ని మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఐసీసీ అధికారికంగా కొత్త షెడ్యూల్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup 2023: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మారింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ లో ఐసీసీ మార్పులు చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సహా మొత్తం 9 మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. ఐసీసీ ప్రకటించిన కొత్త షెడ్యూల్ ఇలా ఉంది.
వన్డే ప్రపంచకప్ అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనుంది. ఈ షెడ్యూల్‌లో చిన్న చిన్న మార్పులు జరిగాయి. కొన్ని మ్యాచ్‌ల తేదీలు మారాయి. మారిన షెడ్యూల్‌లో ఇండియా, పాకిస్తాన్ సహా ఇతర మ్యాచ్‌లు ఉన్నాయి. వాస్తవానికి ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు అక్టోబర్ 14న జరగనుంది.
ఢిల్లీ వేదికగా అక్టోబర్ 14న జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. అక్టోబర్ 12వ తేదీన హైదరాబాద్‌లో జరగాల్సిన పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10 జరుగుతుంది. అక్టోబర్ 13న లక్నోలో జరగాల్సిన ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ అక్టోబర్ 12న జరుగుతుంది. ఇక చెన్నైలో అక్టోబర్ 14న జరగాల్సిన న్యూజిలాండ్-ఇంగ్లండ్ మ్యాచ్ అక్టోబర్ 13న జరుగుతుంది. ధర్మశాల వేదికగా నవంబర్ 11న జరగాల్సిన ఇంగ్లండ్-బంగ్లాదేశ్ డే అండ్ నైట్ మ్యాచ్ నవంబర్ 11నే డే మ్యాచ్‌గా ఉంటుంది. ఇక నవంబర్ 12 వ తేదీన పూణేలో జరగాల్సిన ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మ్యాచ్ నవంబర్ 11న జరుగుతుంది. నవంబర్ 12న కోల్‌కతా వేదికగా జరగాల్సిన ఇంగ్లండ్-పాకిస్తాన్ మరో మ్యాచ్ నవంబర్ 11కు మారింది. నవంబర్ 11న జరగాల్సిన ఇండియా-నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబర్ 12కు మారింది.
వన్డే ప్రపంచకప్ 2024కు ఇండియా ఆతిధ్యమిస్తోంది. ఈ ప్రపంచకప్ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై..నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ప్రారంభం, ముగింపు రెండూ అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నర్ జట్టు న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ ఉంటుంది.
Also read: T20 Series: వెస్టిండీస్‌తో టీ 20 సిరీస్‌లో సూర్య విధ్వంసం, ఇండియా బోణీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook