నాగ్పూర్ టెస్ట్: టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 610/6 డిక్లేర్

నాగ్పూర్ లో జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా  176.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 606 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

Last Updated : Nov 26, 2017, 05:09 PM IST
నాగ్పూర్ టెస్ట్: టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 610/6 డిక్లేర్

నాగ్పూర్ లో జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇనింగ్స్ లో  176.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 606 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 205 పరుగులకు ఆలౌట్ కాగా.. బ్యాటింగ్ పుచ్చుకున్న టీమిండియా శ్రీలంకను ఉతికారదీసింది. కోహ్లీ డబుల్ సెంచరీ(213 పరుగులు), చటేశ్వర్ పుజారా ఒక సెంచరీ (143 పరుగులు), ఓపెనర్ మురళీ విజయ్ ఒక సెంచరీ(128 పరుగులు) చేశారు. తాజాగా రోహిత్ శర్మ కూడా శ్రీలంకపై సెంచరీ (102  పరుగులు) కొట్టి.. టెస్టుల్లో మూడవ సెంచరీ నమోదు చేసాడు. వీళ్ళందరూ బాగా రాణించడంతో భారత్ కు భారీ విజయం చేకూరింది.  కాగా,  రోహిత్ సెంచరీ పూర్తి కాగానే భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 610 పరుగులుగా డిక్లేర్ చేసింది.  దీంతో భారత్ కు 405 పరుగుల భారీ లక్ష్యం దక్కింది.

Trending News