T20 Series: వెస్టిండీస్‌తో టీ 20 సిరీస్‌లో సూర్య విధ్వంసం, ఇండియా బోణీ

T20 Series: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఎట్టకేలకు టీమ్ ఇండియా తొలి విజయం నమోదు చేసింది. రెండు మ్యాచ్‌లలో వరుస పరాజయం తరువాత మూడవ మ్యాచ్‌లో విజయం దక్కించుకుని పరువు నిలబెట్టుకుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 9, 2023, 01:26 AM IST
T20 Series: వెస్టిండీస్‌తో టీ 20 సిరీస్‌లో సూర్య విధ్వంసం, ఇండియా బోణీ

T20 Series: టీమ్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇండియా తొలి విజయం అందుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో పరాజయంతో సిరీస్ 2-0తో వెనుక బడిన ఇండియా మూడవ మ్యాచ్‌లో విజయంతో సిరీస్ 2-1 చేసుకుంది.

టీమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మూడవ టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ 42 పరుగులు, పావెల్ 40 పరుగుల చేశాడు. ఇక ఆ తరువాత బరిలో దిగిన టీమ్ ఇండియా బ్యాటర్లు ప్రారంభంలోనే రెచ్చిపోయారు. సూర్య కుమార్ యాదవ్ మరోసారి వినూత్న తరహాలో షాట్లు కొడుతూ 83 పరుగులు చేసి..ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. మరోవైపు తిలక్ వర్మ సైతం 49 పరుగులతో అద్భుతంగా రాణించాడు. మరో 13 బంతులు మిగిలుండగానే 164 పరుగులు చేసి విజయం కైవసం చేసుకుంది. సిరీస్‌ను 2-1 చేసి పరువు నిలబెట్టుకుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓడిపోయుంటే సిరీస్ వెస్టిండీస్ వశమయ్యేది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండటంతో ఇంకా టీమ్ ఇండియాకు అవకాశముంది.

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20 మూడవ మ్యాచ్‌లో మరోసారి సూర్య కుమార్ విధ్వంసకర బ్యాటింగ్ కన్పించింది. 360 డిగ్రీల్లో అన్ని రకాల షాట్లు కొడుతూ అందర్నీ విస్మయపరిచాడు. ఈ శనివారం నాలుగో టీ20 జరగనుంది. 

Also read: Yashasvi Jaiswal Debut : ఒకప్పుడు పానీ పూరీ అమ్మిన కుర్రాడు.. ఇవాళ టీమిండియాలోకి అరంగేట్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News